యుపీఏ ప్ర‌భుత్వం భూ సేక‌ర‌ణ చ‌ట్టం తీసుకువ‌చ్చిన నాటీ నుంచి దేశంలో ఎక్క‌డా ఏ ప్రాజెక్టు కు  భూసేక‌ర‌ణ జ‌రిపే వీలు  క‌ల‌గ‌లేదు. దీంతో ల‌క్షా 25 వేల కోట్ల రూపాయ‌ల విలువైన వివిధ రకాల ప్రాజెక్టులు ఆగిపోయాయి. 32 రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలు యుపీఏ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన భూ సేక‌ర‌ణ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌లు  చేయాల‌ని కేంద్రాన్ని కోరాయి. ఈ ఊపులో పెట్టిన స‌వ‌ర‌ణ బిల్లు ఇప్ప‌టికీ గ‌ట్టేక్క‌డ లేదు. ప్ర‌ధాని మోడీ ఈ బిల్లు పై ప‌ట్ట‌వ‌ద‌లిన‌ట్లు క‌నిపిస్తే ప‌రువు ప్ర‌తిష్ట‌ల‌కు భంగం క‌లుగుతుంది. పట్టుబిగిస్తే ప్ర‌జావ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకోవాల్సి వ‌స్తుంది. దీంతో మోడీకి ముందు గోయి వెనుక నుయ్యి గా మారింది.

మోడీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న భూ సేక‌ర‌ణ


న‌రేంద్ర‌మోడీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న భూ సేక‌ర‌ణ, పున‌రావాస‌, ప్ర‌త్యామ్నాయ పున‌రావాస బిల్లు-2015 రాజ‌కీయ పార్టీల వ్యూహం మ‌ద్య న‌లిగిపోతూనే ఉన్న‌ది. ఎట్టి ప‌రిస్థితుల్లో ఈ చ‌ట్ట‌స‌వ‌ర‌ణ బిల్లును ఆమోదించాల‌ని చూస్తున్న ఎన్ డిఏ ప్ర‌భుత్వానికి మింగుడుప‌డ‌ని ఘ‌ట‌న‌లు నిరంత‌రం గా జ‌రుగుతూనే ఉన్నాయి. ఇంకోవైపు ప్ర‌తిప‌క్షాల‌కు వ‌చ్చే ఆంశాల సంఖ్య పెరిగిపోతున్న‌ది. కాంగ్రెస్ తో పాటు ఇత‌ర ప్ర‌తిప‌ట‌క్షాల కాకుండా కొన్ని ఎన్డీఏ మిత్ర ప‌క్షాలు కూడా బిల్లు ను వ్య‌తిరేకిస్తుండ‌టంతో ప్ర‌భుత్వం ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది. ఈ చ‌ట్ట  స‌వ‌ర‌ణ ను ఎలాగైనా అడ్డ‌క‌కోవాల‌ని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి బిల్లు వ్య‌తిరేకుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఆర్ఎస్ఎస్ కు చెందిన ప‌లు అనుబంధ సంస్థ‌లు కూడా బిల్లును వ్య‌తిరేకిస్తున్నాయి. భూసేకరణ చట్ట సవరణ విషయంలో పలు రైతు సంఘాలు కూడా తమ వ్యతిరేకతను ఇప్పటికే వ్యక్తం చేశాయి.

భూసేకరణ బిల్లుల‌కు పార్లమెంటు 


భూసేకరణ బిల్లుల‌కు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆమోద ముద్ర వేయించడం కోసం మరో వైపు భారతీయ జనతా పార్టీ చిట్టచివరి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఈ ప్రయత్నాలు ఫలించకపోతే పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడం మినహా మరో మార్గం ఎన్‌డిఏ వద్ద లేదు. లలిత్‌ మోడీ కేసులో పీకల్లోతు కూరుకుపోయిన ఎన్‌డిఏ ప్రభుత్వం ఇప్పుడు ఈ సాహసం చేయగలదా అనేది సందేహమే..ఇటీవల రాజ్యసభలో కొన్ని క్లిష్టమైన బిల్లు సందర్భంగా ఎన్‌డిఏ ప్రభుత్వానికి మద్దతు పలికిన తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా ఈ బిల్లుకు అడ్డుపడుతున్నది. ఈ బిల్లుకు సంబంధించి ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ గడువును మరో మూడు వారాల పాటు పొడిగించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తున్న తరుణంలో కమిటీ చైర్మన్‌ బిజెపి ఎంపి ఎస్‌ ఎస్‌ అహ్లూవాలియా కూడా వారం గడువును కోరుతున్నారు.


ముందు నిర్ణయించిన ప్రకారం ఈ నెల 21న సంయుక్త పార్లమెంటరీ కమిటీ తన నివేదిక సమర్పింంచాల్సి ఉంది. 28 వరకూ గడువును పొడిగించాలని కమిటీ చైర్మన్‌ లోక్‌సభ స్పీకర్‌ను కోరుతున్నారు. ఇప్పటి వరకూ ఈ బిల్లును పరిశీలించేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ తొమ్మిది సార్లు సమావేశమైంది. 30 మంది సభ్యుల ఈ కమిటీలో బిజెపి ఎంపీలు 11మంది ఉన్నారు. మరో ఐదుగురి మద్దతు లభిస్తే తప్ప కమిటీలోనైనా మెజార్టీ సమకూరే అవకాశం ఉండదు. బహుశ అందుకేనేమో కమిటీ గడవు పొడిగించాల్సిందిగా కోరుతున్నది. అనేక రాష్ట్రాల‌  నుంచి ఇంకా సూచనలు, సలహాలు అందలేదని అందుకే గడవు పెంచాలని అహ్లూవాలియా తన లేఖలో పేర్కొనబోతున్నారు. ఈ బిల్లుకు సంబంధించి విపక్ష శిబిరంలోని కొన్ని పార్టీలనైనా తన వైపు తిప్పుకోవడంలో ఎన్‌డీఏ పూర్తిగా విఫలమైంది. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఎదుట వాదనలు వినిపించిన 44 సంఘాల్లో 42 సంఘాలు బిల్లులలోని అంశాలను వ్యతిరేకించాయి. 

 బిల్లులపై కొంత సమయం తీసుకోవడమే మేలన్న


ఈ నేపథ్యంలో బిల్లులపై కొంత సమయం తీసుకోవడమే మేలన్న భావనకు అహ్లూవాలియా వచ్చి ఉంటారు. భూసేకరణ బిల్లును రాజ్యసభలో కాంగ్రెస్‌తో పాటు సమాజ్‌వాది పార్టీ, బిఎస్‌పి, ఎన్‌సిపి, జెడియూలు వ్యతిరేకిస్తున్నాయి. వీటికి తృణమూల్‌ కాంగ్రెస్‌ తోడైంది.ఈ చట్ట సవరణ బిల్లు సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఆమోదం పొంది, ఆ తర్వాత రాజ్యసభలో వీగిపోతే పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వానికి వీలుఏర్పడుతుంది. సంయుక్త పార్లమెంటు సమావేశం నిర్వహించాలంటే బిల్లుల ఏదో ఒక సభలో వీగిపోయి ఉండాలి. 


అయితే మంత్రులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ క్లిష్ట సమయంలో నరేంద్ర మోడీ సర్కారు ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటుచేయడం లాంటి అసాధారణ చర్యకు సిద్ధపడుతుందా అన్నదే ఇక్కడ ప్రశ్న. ఇలాంటి చర్యకు ప్రభుత్వం సంకోచించబోదని గత నెల 23న ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు.అయితే దీనిపై న‌రేంద్ర మోడీ అభిప్రాయం మ‌రోలా ఉంది  భూసేక‌ర‌ణ బిల్లులు నాకు అమ‌లు ప‌ర‌చ‌టం నాకు స‌మ‌స్యేమీ కాదు రాష్ట్రాల నుంచి వ‌చ్చిన డిమాండ్ల మేర‌కే చ‌ట్ట స‌వ‌ర‌ణ చేయాల‌నుకున్నాం. ఈ విష‌యంలో సూచ‌న‌ల‌ను ఆమోదించ‌డానికి ప్ర‌భుత్వం ఇంకా సిద్దంగా ఉంది అని మే 30 న ఆయ‌న  పేర్కోన్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థిత్తుల్లో ఈ  బిల్లు గ‌ట్టేక్క‌డం కొంచెం క‌ష్ట‌మే అయినా ప్ర‌ధాని మోడీ మాత్రం దీనిపై ప‌ట్టు విడ‌వ‌టంలేదు చూడాలిమ‌రి మోడీ ఈ బిల్లు ను ఎలా గ‌ట్టేక్కిస్తారో....


మరింత సమాచారం తెలుసుకోండి: