కాంగ్రెస్ సీనియర్ నేత డీ.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 6 న తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నారు. దీనిపై కాంగ్రెసక్ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. నిన్నటి వరకు డీఎస్ టీఆర్ఎస్ లోకి చేరుతున్నారన్న వార్త విని ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఆయన ఇంటికి వెళ్లారు కానీ వారికి అందుబాటులో లేడు ఆ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ తనను ఇంటికి రమ్మని ఇంట్లో లేకుండా పోవడాన్ని తీవ్రంగా పరిగణించారు ఇలాంటి సందర్భంలో ఆయన గురించి ఏం మాట్లాడుతాం అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించిన డీఎస్ ఇప్పుడు పార్టీ వీడటం పచ్చ మోసమని స్వార్థానికి నిలువుటద్దమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


దిగ్విజయ్ సింగ్ 


ఇక డీఎస్ పార్టీ వీడటాన్ని అధిష్టానం తీవ్రంగా పరిగణించింది, డీఎస్‌ను బుజ్జగించవలసిన అవసరం లేదని ఆయనకు తొమ్మిదిసార్లు టిక్కెట్ ఇస్తే మూడుసార్లే గెలిచారని, వరుసగా మూడుసార్లు ఓడినా ఎమ్మెల్సీ ఇచ్చామని చెప్పారు. డీఎస్‌ను బుజ్జగించవలసిన దిగ్విజయ్ సింగ్ నేతలకు సూచించారని సమాచారం. మరో వైపు డీ శ్రీనివాస్ పార్టీని వీడుతారని భావించలేదని తెలంగాణ కాంగ్రెస్ మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు డీఎస్ పైన నిప్పులు చెరుగుతున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: