ఓటుకు నోటు కేసులో చర్లపల్లి జైలులో కొన్ని రోజులు గడిపిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మంగళవారం కొన్ని షరతులతో కూడిన బెయిల్ లభించిన విషయం తెలిసిందే. అయితే అందులో కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆయన బుధవారం సాయంత్రం 5 గంటలకు విడుదల అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా ర్యాలీ నిర్వహించారు. బెయిల్ మీద జైలు నుంచి విడుదలైన సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన హంగామా గురించి సీఎం కేసీఆర్ సీనియర్ పోలీస్ అధికారులతో గురువారం చర్చించినట్లు సమాచారం.

రేవంత్ రెడ్డి ర్యాలీ సందర్భంగా పుష్ఫగుత్యం అందిస్తున్న కార్యకర్త


అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం, ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగించడం ఆరోపణలతో కుషాయిగూడ, మల్కాజిగిరి పీఎస్‌లలో కేసులు పెట్టారు. ఆయనపై 341, 188, 506, 509 సెక్షన్ల కింద ఈ కేసులు నమోదయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: