బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పటి వుకు పెళ్లికాని ప్రసాదే.. గతంలో మనోడికి పెళ్లి వరకు వచ్చిన అమ్మాయిలు అనుకోకుండా తుస్సు మన్నారు. దీంతో మనసు వికలం అయ్యిందో ఏమో కాని ఇప్పటి వరకు పెళ్లి ప్రసక్తే తేలేదు. ఒకవేళ పనికట్టుకొని మీడియా పెళ్లి ప్రస్తావన తెస్తే తనకు ఇప్పుడు ఆ ఆలోచన లేదని తప్పించుకునే వాడు. కానీ ఈ మద్య మనోడి మనసు కాస్త పెళ్లివైపు లాగుతుందేమో అని అనిపిస్తుంది.

ఈ నెలలో షాహిద్ కపూర్ పెళ్లి పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడంతో బాలీవుడ్ పెద్దలంతా తరలి వచ్చే అవకాశం ఉందట. ఈ సందర్భంగా సల్మాన్ ని పెళ్లి విషయం ప్రస్తావించగా ఇప్పుడు తన వద్దకు వచ్చి పెళ్లి చేసుకుంటావా అని అడిగితే ఆలోచిస్తానని చెసుకునేందుకు సిద్దంగానే ఉన్నానని మనసులో మాట చెప్పారు అంతే కాదు ప్రేమ వివాహాల కంటే పెద్దలు కుదర్చిన పెళ్లి చాలా మాంచిదని తన అభిప్రాయమని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: