తెలంగాణ ప్రాంతంలో ఏబీఎన్ ఛానల్ పై అప్రకటిత నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. ఆంధ్రజ్యోతి పత్రిక ఈ విషయాన్ని ప్రజలకు గుర్తు చేసేందుకు తాను ప్రచురించే కొన్ని వార్తలపై ఈ సంకెళ్లు ఇంకెన్నాళ్లు అంటూ నిషేధించిన రోజులు లెక్కబెట్టి మరీ స్టాంప్ వేస్తోంది. ఈ స్టాంపు వేయడం మొదలుపెట్టి ఏడాది దాటినా నిషేధం మాత్రం కొనసాగుతూనే ఉంది. 

సాక్షాత్తూ కేంద్ర మంత్రే రంగంలోకి దిగినా పని కాలేదు. చివరకు ఈ విషయంలో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ కూడా విమర్సించడం మినహా ఏమీ చేయలేకపోయారు. కేసీఆర్ ఒత్తిళ్లతో పాటు తెలంగాణ ఎమ్మెస్వోల్లో ఏబీఎన్ పట్ల ఉన్న వ్యతిరేకత కూడా ఇందుకు ఓ కారణం కావచ్చు. ఐతే.. అలాంటి అప్రకటిత నిషేధం ఎదుర్కొంటున్న ఏబీఎన్ ఛానల్ పై బెయిల్ పై విడుదలైన రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశాడు. 

రేవంత్ ఆ ఛానలే చూస్తాడట.. 


రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కేవలం ఏబీఎన్ మాత్రమే చూసేవాడట. ఈ విషయం స్వయంగా రేవంత్ రెడ్డే చెప్పారు.  తెలంగాణ నిషేధం ఉందని చెప్పుకుంటున్నా...చెర్లపల్లి జైల్లో ఉన్న ఏబీఎన్ కేసీఆర్ కుట్రలను బయటపెడుతోందని రేవంత్ ఆ ఛానల్ పై ప్రశంసలు కురిపించాడు. బహుశా చెర్లపల్లి జైల్లో టీవీలకు డీటీహెచ్ కనెక్షన్ ఉండి ఉండొచ్చు. 

తాను జైళ్లో ఉన్పప్పుడు ఓ రేపిస్టును జనం కొట్టి చంపిన వార్త చూశానని రేవంత్ చెప్పారు. చిన్నారిని రేప్ చేసి చంపేసినందుకు రేపిస్టును జనమే కాళ్లతో తొక్కి తొక్కి చంపారని.. అలాగే తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికి అదే గతి పట్టించాలని రేవంత్ పిలుపు ఇచ్చారు. ఇలా రేవంత్ రెడ్డి ఏబీఎన్ పై ప్రేమ కురిపించాడు. ఏబీఎన్ కూడా రేవంత్ కు బెయిల్ వచ్చిన రోజు తెలంగాణ పులిబిడ్డ అంటూ పాటలు ప్రసారం చేయడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: