ఓటుకు నోటు కేసుతో రేవంత్ రెడ్డి పాపులారిటీ అమాంతం పెరిగింది. టీడీపీలో రేవంత్ రెడ్డి ప్రాధాన్యం కూడా పెరిగింది. అసలు తనను మొన్నటి మహానాడులోనే తెలంగాణ టీడీపీ శాఖకు అధ్యక్షుడిగా ప్రకటిస్తానని చంద్రబాబు తనతో చెప్పారని స్వయంగా రేవంత్ రెడ్డే గతంలో చెప్పుకున్నారు. కూతురి వివాహం ఉందని.. అందుకే అప్పుడే ప్రకటించవద్దని తానే వారించానని రేవంత్ రెడ్డి చెప్పుకున్నాడు. 

ఇంతలో ఈ ఓటుకు నోటు కేసు బయటికొచ్చింది. ఇక అప్పటి నుంచి మీడియాలో రేవంత్ రెడ్డి తెగ పాపులర్ అయ్యారు. ఇప్పుడు బెయిల్ పై బయటికొచ్చిన తర్వాత.. రేవంత్ మరింత చురుగ్గాపావులు కదపాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 50 లక్షలు లంచమిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినందువల్ల రేవంత్ రెడ్డి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. 

రేవంత్ రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తారా..?

Image result for REVANTH REDDY
అందుకే తన శాసనసభ్వత్వాన్ని స్పీకర్ రద్దు చేయకముందే తానే రాజీనామా చేస్తే పాపులారిటీ మరింత పెరుగుతుందని రేవంత్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దమ్ముంటే మంత్రిపదవులకు రాజీనామా చేసి.. మళ్లీ గెలవమని తెలంగాణ మంత్రులకు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇప్పుడు ఆ సవాల్ కు దీటుగా ముందుగా తానే రాజీనామా చేసి చూపించి.. రేసులో ముందుండాలని భావిస్తున్నారట.    

అధికారంలో లేని సమయంలో రాజీనామా చేస్తే తిరిగి పోటీ చేసి గెలవకపోతే పరిస్థితి ఏమిటన్న ఆలోచన కూడా ఉంది. ఒకవేళ వ్యూహం బెడిసికొట్టి రేవంత్ రెడ్డి ఓడిపోతే అసలుకే మోసం వస్తుందని సన్నిహితులు వారిస్తున్నారట. ఎంత పాపులార్టీ వచ్చినా అధికార పార్టీని తక్కువ అంచనా వేయకూడదని.. పోటీ చేసి గెలవడం అంత సులభం కాదని వారిస్తున్నారట. ఐతే.. ఎలాగూ తన శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తారు కాబట్టి ముందే మేల్కొంటే.. ఆ తర్వాత ఎలా జరగాలో అలా జరుగుతుందని రేవంత్ ప్లాన్ చేస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: