తెలంగాణలో ఓటుకు నోటు వ్యవహారంతో ఏపీ ముఖ్యమంత్రి బండారం బయట పడింది అని  ఏపీ శాసనసభలో విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఏపీలో అక్రమంగా సంపాదించిన సొమ్ముతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించారని పాపం ఎక్కడా దాగదని అది ఆయనకే బెడిసి కొట్టిందని ఎద్దేవా చేశారు. హత్య చేయడం తప్పు కాదని, హత్య కేసులో పట్టుబడ్డ వ్యక్తి పట్టుబడితే వీడియో తీయడం తప్పని చంద్రబాబు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. తన పార్టీ ఎమ్మెల్యే తెలంగాణ ఎమ్మెల్యేతో బేరమాడుతూ ఏసీబీకి అడ్డంగా బుక్ అయ్యాడు, మరుసటి రోజు బాబు విజయవాడలో చిన్నపిల్లలతో అవినీతిరహిత రాష్ట్రం చేస్తానని చిన్నపిల్లలతో ప్రమాణం చేయిస్తాడు.ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకోటి ఉందా? డబ్బుకట్టలతో పట్టుబడి దానిని తప్పుదోవ పట్టించేందుకు సెక్షన్-8, ట్యాపింగ్ అంటూ మాట్లాడుతున్నాడు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు


నేరం చేసిన వారి పరిస్థితి బహిరంగానే వీడియోలో కనిపిస్తూనే ఉంది అయినా మా తప్పు లేదని కావాలని టీ సర్కార్ తమను ఇరికించిందని పిట్ట కథలు చెబుతున్నారు. పైగా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి తమ పార్టీ మద్దతు ఇస్తున్నారని గందరగోళం సృష్టిస్తున్నారు. విభజన అయ్యాక ఆ రాష్ట్రంలో ఎవరికి మద్దతు ఇస్తే ఏమి ఉంటుందని జగన్ ప్రశ్నించారు.ఎపిలో అవినీతికి పాల్పడి ,అవినీతి డబ్బుతో తెలంగాణలో ఎమ్మెల్యేలను చంద్రబాబు కొంటున్నారని ఆయన అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: