తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ సినిమాకు పెట్టని భారీ పెట్టుబడితో రూపొందించిన చిత్రం‘బాహుబలి’. దర్శక ధీరుడు రాజమౌళి రెండు సంవత్సరాలు ఏకబిగిన కష్టపడి రూపొందించిన చిత్రం అందుకే ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దానికి తగ్గటుగానే ఏ సినిమాకు రాని ప్రచారం ఈ సినిమాకు వచ్చింది. ‘బాహుబలి’ జూలై 10 న  విడుదల చేస్తున్న నేపథ్యంలో ఒకరోజు ముందే జూలై 9న విజయవాడతో సహా పలు ప్రదేశాల్లో ప్రీమియర్ షో వేసి తద్వారా వచ్చే మొత్తాన్ని ఏపీ రాజధాని అమరావతికి ఫండ్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


బాహుబలి పోస్టర్


బాహుబలి పార్ట్ 1 ఒక్క తెలుగులోనే ఇప్పటి వరకు దాదాపు 83 కోట్ల బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు రిలీజ్ ముందే ఇంత పెద్ద మొత్తంలో బిజినెస్ జరుగలేదు. శాటి లైట్ రైట్స్, ఇతర రైట్స్ ఇలా అన్ని కలిపి పార్ట్ 1 ఇప్పటికే 125 కోట్ల బిజినెస్ చేసింది.  ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్య కృష్ణ, సత్యరాజ్ తదితరులు ముఖ్య పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: