ఓటుకు నోటు వ్యవహారంలో మొన్నటి వరకు చర్లపల్లి జైల్లో ఉన్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి కొత్త టెన్షన్ మొదలైంది. మంగళవారం ఆయనకు కొన్ని షరతులతో కూడిన బెయిల్ వచ్చింది. ఆయనపై ఏసీబీ  దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టులో నేడు జరగనున్న విచారణ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఓటుకు నోటు కేసలో ఏ-1 నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డితో పాటు సహ నిందితులు సెబాస్టియన్, ఉదయసింహలు బెయిల్ పై విడుదల అయ్యారు. ఆ తర్వాత రేవంత్ కార్యకర్తలు, అభిమానుల తో సాగిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు.

రేవంత్ రెడ్డి విడుదలైన సందర్భంగా ఊరేగింపుగా..

రేవంత్ రెడ్డి పై మూడు కేసులు..!!

ఈ సందర్భంగా ప్రభుత్వంపై కేసీఆర్ పై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేవంత్ బెయిల్ రద్దు కోరుతూ ఏసీబీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్ రెడ్డి బయట ఉంటే దర్యాప్తునకు తీవ్ర విఘాతం కలగడం ఖాయమని, వెంటనే ఆయన బెయిల్ ను రద్దు చేయాలని పిటిషన్ లో పెర్కోంది.  అయితే సుప్రీం కోర్టులో ఈ కేసు ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలో జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ అమితవ రాయ్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటీషన్ ను విచారించనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: