నరేంద్రమోడి దేశాభివృద్దిలో భాగాంగా అనేక రకాలు కార్యక్రమాలు చేపడుతున్నారు. మేక్ ఇండియా గా తీర్చి దిద్దాలని ఆయన అభివృద్ది కోసం టెక్నాలజీని ఎంతో ఉపయోగిస్తున్నారు. ఈ మద్య బేటీకో బచావ్ అనే వినూత్న కార్యక్రమం చేపట్టారు. కుటుంబంలో కూతురు ఉంటే తనతో తండ్రి సెల్పీఫోటో దిగి పోస్ట్ చేయమని దీని సారాంశం. అయితే దీనికి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది సెలబ్రెటీలు, పారిశ్రామిక వేత్తలు దీన్ని స్వాగతించారు. ఈ విషయంలో డిగ్గీ రాజా మేటర్ పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఎలా అనుకుంటున్నారా డెబ్బై సంవత్సరాల వయసుకు దగ్గరలో పడిన డిగ్గీరాజా.. ఇటీవలే నలభయ్యో పడిలో ఉన్న అమృతా రాయ్ అనే జర్నలిస్టును త్వరలోనే పెళ్లి చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే.


అమృతారాయ్, దిగ్విజయ్ సింగ్ 


అయితే గతంలో  వీరిద్దరి సెల్పీఫోటో సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేసింది. ఈ విషయం తెలియని అమెరికన్ పత్రిక న్యూయార్క్ టైమ్స్ పెద్ద పోరపాటే చేసింది. సదరు పత్రిక వారు ఆమెను మన డిగ్గీ రాజాకు కూతురు అనుకుని అమృతా రాయ్ కిలిసి ఉన్న సెల్పీ ఫోటో  సెల్ఫీ విత్ డాటర్ విభాగంలోకి చేర్చేసింది. ఈ విషయాన్ని గమనించి ఒకరు దాన్ని ట్విట్ చేశారు. ఈ మేటర్ సోషల్ మీడియాలో పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. మరి దీనిపై దిగ్విజయ్ సింగ్ నుంచి గానీ, అమృతా రాయ్ నుంచి గానీ ఎలాంటి స్పందనా రాలేదు.

దిగ్విజయ్ సింగ్ విషయంలో తప్పులో కాలేసిన న్యూయార్క్ టైమ్స్ వెంటనే సవరణను వేసింది. ఆ తప్పునకు విచారిస్తున్నామంటూ తెలిపింది. ట్విట్టర్‌లో పలువురు ఆ ఫొటోపై సెటైర్లు విసురుతుండడంతో న్యూయార్క్ టైమ్స్ ఆ సవరణ ఇచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: