ఈ మధ్య టీడీపీ నేతల నుంచి ఓ డైలాగ్ వినిపిస్తోంది. అదే తెగేదాకా లాగొద్దు.. అని.. ఈ మాట ఎక్కడో విన్నట్టుందే అనుకుంటున్నారా.. ఔను.. ఆ మధ్య నట నాయకుడు పవన్ కల్యాణ్ కూడా ట్వీట్ ద్వారా ఇవే ప్రవచనాలు వల్లించారు. ఇప్పుడు టీడీపీ నాయకులు కూడా  ఆయన డైలాగ్ నే రిపీట్ చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టుకు వెళ్లినా తెలంగాణ ప్రభుత్వానికి నిరాశే ఎదురైంది. ఆ పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీనిపై వ్యాఖ్యానించిన టీడీపీ సీనియర్ నేత  రావుల చంద్రశేఖరరెడ్డి.. సుప్రీం తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టు అని కామెంట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు.

ఆ మాటల అర్థం రాజీమంత్రమేనా..?

Image result for ravula chandrasekhar reddy
దాదాపు నెల రోజుల క్రితం ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్వవహారాలు తెలుగు రాష్ట్రాలను కుదిపేశాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేస్తారేమో అన్నంతగా సీన్ క్రియేటైంది. ఆ తర్వాత క్రమంగా తెలంగాణ సర్కారు దూకుడు తగ్గింది. లేటెస్టు పరిస్థితి చూస్తే.. అరెస్టు కాదు కదా కనీసం నోటీసులు కూడా ఇచ్చేసీన్ కనిపించడం లేదు. 

ఐనా.. టీడీపీ నేతల నుంచి.. పదే పదే ఇదే డైలాగ్ వినిపిస్తోంది.. తెగేదాకా లాగొద్దని. అంటే.. మీ తప్పులు మేం కాస్తాం.. మా తప్పులు మీరు కాయండి.. అని బహిరంగంగా అప్పీల్ చేసుకుంటున్నట్టే లెక్క. పరోక్షంగా తమవైపు తప్పు ఉందని ఒప్పుకుంటున్నట్టే. మరి తెలంగాణ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటిలాగానే నత్తనడకన కేసుల దర్యాప్తు కొనసాగిస్తుందా..జోరు పెంచుతుందా అన్నది ముందు ముందు తేలుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: