ఆంధ్రా, తెలంగాణ విడిపోయాయి. రెండు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. తొలి ఏడాది కూడా గడచిపోయింది. రెండు రాష్ట్రాలు ఏర్పడినా.. ఇక ఒకదానితో ఒకటి సంబంధం లేదని అనుకుంటే పొరపాటే. ఏపీ రాజకీయ పరిణామాలు, తెలంగాణపైనా.. తెలంగాణ రాజకీయ పరిణామాలు ఆంధ్రాపైనా ప్రభావం చూపకమానవు.

తెలంగాణ రాష్ట్ర సమితి వంటి ఉప ప్రాంతీయ పార్టీలు ఉన్నది ఒక్క రాష్ట్రంలోనే కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ టీడీపీ, వైసీపీ వంటి రాజకీయ పార్టీలు మాత్రం రాజకీయ వ్యూహాల సమయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. తెలంగాణ వ్యవహారం కదా.. ఆంధ్రాతో పనేముంది.. ఆంధ్రా వ్యవహారం కదా.. తెలంగాణతో పనేముంది అని ఆలోచిస్తే కష్టమే. 

జగన్.. ఈ సంగతి ఆలోచించారా..?

Image result for JAGAN POLITICS
వైఎస్సార్సీపీ అధినేత జగన్ లో ఆ స్పృహ కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో.. తనకున్న ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యేను టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నామని ఆ పార్టీ ప్రకటించింది. మామూలుగా చూస్తే ఇది చాలా చిన్న విషయం.. ఓ ఎమ్మెల్సీ గెలవాలంటే 18  ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. అందులో ఓ ఓటు అంటే చాలా చిన్న మేటర్. 

జగన్ కూడా అదే అనుకున్నారు. అదో పెద్ద విషయం కాదనుకున్నారు. అంతే కాదు.  రాష్ట్ర విభజన పూర్తయ్యాక తెలంగాణ రాష్ట్రంలో తాము ఎవరికి మద్దతు ఇస్తే ఏమి ఉంటుందని జగన్ కామెంట్ చేశారు. ఈ ఆలోచనాధోరణే జగన్ కొంప ముంచుతుంది. ఎమ్మెల్యేలు ఒక్కరా ఇద్దరా అన్నది కాదు పాయింట్.. విభజన వాది టీఆర్ఎస్ తో చేతులు కలిపారా లేదా అన్నది. జగన్ తప్పిదంతో పండుగ చేసుకున్న టీడీపీ నేతలు టీఆర్ఎస్ - జగన్ కుమ్మక్కయ్యారన్న ప్రచారాన్ని జోరుగా చేసి.. జగన్ ను సొంత రాష్ట్రంలో డిఫెన్సులో పడేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: