చంద్రబాబు అపర రాజకీయ చాణక్యుడు. ఈ విషయం పార్టీలకతీతంగా అంతా ఒప్పుకుంటారు. అందుకు లేటెస్టు ఉదాహరణే ఈ ఓటుకు నోటు కేసు.  మొదట్లో డిఫెన్సులో పడిపోయినట్టు కనిపించినా..చివరకు తనదే పై చేయి అనిపించుకుంటున్నారు. మరి చివరి వరకూ కేసు ఏమవుతుందో చూస్తే కాని తెలియదు. 

రాజకీయమే కాదు.. పరిపాలనలోనూ చంద్రబాబుకు గతంలో మంచి మార్కులే పడ్డాయి. వర్షాభావం, కరువు కాటకాలతో కాలం కలసి రాలేదు కానీ చంద్రబాబు పాలన అద్భుతమంటూ అప్పట్లో పత్రికలు తెగపొగిడేశాయి. ఐతే.. పని రాక్షసుడని.. ఎంత బాగా పని చేసినా తిడుతూనే ఉంటారని.. ఉద్యోగులు ఆయనపై కోపం పెంచుకున్నారని చెబుతారు. ఆ కోపమే 2004 ఎన్నికల్లో కొంప ముంచింది.

బాబంటే వణికిపోతున్న ఉద్యోగులు.. 


అందుకే దాదాపు పదేళ్ల తర్వాత పాలనాపగ్గాలు అందుకున్న బాబు మొదట్లో ఉద్యోగులతో జాగ్రత్తగానే ఉన్నారు. ఆర్థికంగా భారమైనా వారి జీతాల పెంపుదల డిమాండ్లకు తలొగ్గారు. ఆ మాట ఆయనే చెప్పాడు. కానీ రాను రాను.. మళ్లీ బాబులో పాత బాబు కనిపించేస్తున్నాడేమో అనిపిస్తోంది. 

ఈమధ్య ఉద్యోగులపై విరుచుకుపడటం బాగా ఎక్కువైంది. ఉద్యోగులకు బాబులో మళ్లీ పదిహేనేళ్ల క్రితం నాటి పాత బాబు కనిపిస్తున్నాడు. సమీక్షా సమావేశాల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం.. మీరేం చేస్తారో నాకు తెలియదు.. కాను రిజల్టు కనిపించాలి అని హెచ్చరించడం.. ఇన్నాళ్లూ ఏం చేస్తున్నారని మండిపడటంతో.. ఉద్యోగులు షాకవుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: