కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని శుక్రవారం సాయంత్రం పోలీసులు అరెస్టుచేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో మధ్యాహ్నం సమయంలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, పోలీసు అధికారుల మధ్య వాగ్వివాదం జరిగింది. పరస్పరం నువ్వెంత అంటే నువ్వెంత అని సవాళ్లు విసురుకున్నారు. విధులకు ఆటంకం కల్పిస్తున్నారని భూమాను  3 టౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. డీఎస్పీ పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేసులో అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో అనుచరులు పోలీసులను అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్యనే పోలీసులు అతనిని స్టేషన్‌కు తరలించారు.


భూమా నాగిరెడ్డి అరెస్టు

bhuma nagireddy

తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని, తన ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతూ విధులకు ఆటంకం కలిగించారంటూ డీఎస్పీ దేవదానం ఫిర్యాదు చేశారు. అందుకే  భూమా నాగి రెడ్డి  పైన పోలీసులు కేసు చేశామన్నారు.  మరోవైపు, భూమా ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. దాదాపు వందమంది పోలీసులు మోహరించారు. దీంతో, స్థానికంగా ఉద్రిక్త ఏర్పడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: