శాసనమండలి ఎన్నికలలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగంపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.ఎన్నికల సందర్భంగా తన విధులకు ఆటంకం కలిగించారని,తనపై దూషణకు దిగారని డిఎస్పి దేవదానం ఫిర్యాదు చేసి శుక్రవారం సాయంత్రం ఆయనను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

 భూమా నాగిరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. జైలుకు తరలిస్తున్న సమయంలో తనకు ఛాతిలో నోప్పిగా ఉందని తెలపడంతో పోలిసులు వెంటనే తిరిగి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య సదుపాయాలు లేని కారణంగా వైద్యులు హైదారాబాద్ లోని నిమ్స్ కు తరలించాలని సూచించారు. దింతో భూమాను పోలిసులు హైదారాబాద్ కు తరలిస్తున్నట్లు తెలిసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: