పుష్కరాల సమయంలో ఉండబోయే రద్దిని దృష్టిలో ఉంచుకొని, భక్తుల సౌకర్యార్థం భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి శీఘ్ర దర్శనం మరియు నిత్యకళ్యానం, సహస్ర నామార్చన, ఉంజల్ సేవల టికెట్లను ఎక్కడి నుండైనా ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయాన్ని శుక్రవారం నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్లు  ఆలయ కార్య నిర్వహాక అధికారి తెలిపారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కర ఉత్సవాలు జరిగే 12 రోజుల్లో అంటే (తేది : 14-7-2015 నుండి 25-7-15) వరకు ఏ రోజుకైనా శీఘ్ర దర్శనం మరియు సేవల టికెట్ లను బుక్ చేసుకోవచ్చిఅన్నారు.

 శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాన మహోత్సం


ప్రస్తుతానికి ప్రతి రోజుకు 15000 శీఘ్ర దర్శనం టికెట్ లు మరియు 800 నిత్య కళ్యాణం టికెట్లు, 800 సహస్ర నామార్చన, 800 ఉంజల్ సేవల టికెలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. దీని కోసం భక్తులు తమ ఫోటో, ప్రభుత్వం చే జారీ చేయబడిన ఏదైనా గుర్తింపు కార్డు వివరాలు నమోదు చేసి, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించి బుక్ చేసుకోవచ్చు అన్నారు. బుక్ చేసుకున్న భక్తులు తమ బుకింగ్ టికెట్ తో పాటు, బుకింగ్ సమయంలో వివరాలు అందించిన గుర్తుంపు కార్డులను కూడా తీసుకొని రావాలసి ఉంటుందని అన్నారు. 


 శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాన మహోత్సం


ఈ 12 పుష్కర రోజులలో రోజుకి దాదాపు 20 గంటలు దర్శనం దేవస్థానం కల్పిస్తుందని, శీఘ్ర దర్శన రద్దిని ఈ 20 గంటలలో గంటల వారీగా స్లాట్ లుగా విభజించి, గంటకి కొన్ని టికెట్ ల చొప్పున పరిమితి విధించి టికెట్ లనుజారీ చేయనున్నారు. ఉదాహారణకి ఒక తేదీలో ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మద్యలో స్టాట్ ఉన్న పరిమితి పూర్తి అయితే ఆ సమయంలో కాకుండా కాళీగా ఉన్న అందుబాటులో గల మరో స్లాట్ లో బుక్ చేసుకోవచ్చు అన్నారు. దీని ద్వారా భక్తులకు ఇబ్బంది లేకుండా వారికి కేటాయించి సమయంలో (స్లాట్లో ) సులువుగా దర్శనం చేసుకోవచ్చు.

 శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాన మహోత్సవానికి విచ్చేసిన భక్తులు


నిత్య కల్యాణం ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం అవుతుంది, సహస్ర నామార్చన ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు, ఉంజల్ సేవ ప్రతి రోజూ సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించ బడుతుంది. ఈ టికెట్ లను బుక్ చేసుకోవడానికి భక్తులు, యాత్రికులు www.bhadrachalam.co.in లేదా www.badrachalam.co.in  చూడవచ్చు. భక్తులు ప్రణాలికాబద్దంగా, ఎటువంటి అసౌకర్యం లేకుండా సమయం వృధా కాకుండా శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శనం చేసుకొని భక్తులు  తరించే విధంగా ఈ ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: