గత కొన్ని రోజులు గా తెలుగు రాష్ట్రాలో చర్చనీయాంశంగా మారిన ఓటుకు నోటు వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో కొత్త పేరు వినిపిస్తుంది అంతే కాదు  ఇప్పటి వరకు కేసులో ఎక్కడా బయటపడని 'జిమ్మీ' అనే వ్యక్తికి ఏసీబీ అధికారులునోటీసు జారీచేశారు. సోమవారం సాయంత్రంలోగా విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. సెబాస్టియన్‌ను స్టీఫెన్ సన్ వద్దకు తీసుకొచ్చి, ఆయనను పరిచయం చేసిన వ్యక్తే ఈ జిమ్మీ అని తెలిసింది. ఈ విషయాన్ని స్టీఫెన్‌సన్ తన వాంగ్మూలంలో తెలిపారు.  

స్టిఫెన్ సన్, రేవంత్ రెడ్డి


ఇప్పటి వరకు రెండు రాష్ట్రాలనే కుదిపివేసిన కేసులో ఇప్పటి వరకు ఈ పేరు బయటకు రాకపోవడం గమనార్హం అయితే ఓటుకు నోటు కేసు లో ప్రధ ముద్దాయిగా ఉన్న రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చంది. ఆయన బెయిల్ రద్దు చేయాలని టీ ఏసీబీ సుప్రీం కోర్టులో పిటీషన్ వేసింది కానీ అక్కడ ఏసీబీకి చుక్కెదురయ్యింది. ఇప్పుడు ఈ కేసులో కొత్త ముఖం బయటకు రానుందా..? ఈ కేసులో జిమ్మీ పాత్ర ఏంటి.. అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. అంతేగాకుండా అతనికి రాజకీయాల్లో ఉన్న సంబంధాలు ఇతరత్రా అంశాలపై ఏసీబీ విచారణలో తేలనుంది. ఈ కేసులో  ముందుగానే పేర్లు బయటకు వస్తే వాళ్లంతా జాగ్రత్త పడతారని, చిట్ట చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: