తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అటు ఆంధ్రలో, ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రాబల్యం పూర్తిగా పడిపోయింది. కొందరు సీనియర్ నేతలు ఒక్కొక్కరూ వలసల బాట పట్టారు. ఇక తెలంగాణలో అయితే ఈ మద్య కాంగ్రెస్ సీనియర్ నాయకులు డీ.శ్రీనివాస్ టీఆర్ఎస్ లోకి వెళ్లడం కాంగ్రెస్ వర్గీయులను ఒకింత కలవరపరిచింది. ఇప్పుడు హైదరాబాద్ లోని గాంధీభవన్ లో పార్టీ మారిన పీసీసీ మాజీ అధ్యక్షులు డీ.శ్రీనివాసరావు, కే.కేశవరావు, బొత్స సత్యనారాయణల ఫోటోలను తొలగించారు.

గాంధీ భవన్


Gandhi-Bhavan-620x330

పీసీసీ హోదాలో ఉన్నపుడు వారి ఫోటోలకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు, తాజాగా పార్టీలు మారిన వారిలో కె.కేశవరావు,డి.శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ ఈ ముగ్గురూ పీసీసీ పదవి అనుభవించిన వారే.. కానీ ఇద్దరు టీఆర్ఎస్ లోకి జంప్ అయితే..ఒకరు వైఎస్సాఆర్ సీపీలోకి జంప్ అయ్యారు. ఈ రోజు గాంధీభవన్ కు వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, దామోదర్ రెడ్డి ఆ ముగ్గురి ఫోటోలను తొలగించి చెత్తబుట్టలో పడేశారు.

పార్టీలో ఉండి ఎన్నో పదవులు అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉంటే ఎవరి స్వార్థం వారు చూసుకున్న ఈ ముగ్గరు మాజీ పీసీసీ ల ఫోటోలు వెంటనే తొలగించి చెత్తబుట్టలో పడేయండి అని ఆదేశించారు  కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, దామోదర్ రెడ్డి.  పార్టీ మారిన వారి చిత్రాలు గాంధీభవన్ లో ఉండటం మంచిదికాదని, వారంతా తమ స్వలాభం కోసం పార్టీ మారారని వారు ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: