ఓటుకు నోటు కేసు వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేదు.. అయితే ఈ కేసులో ప్రధమ ముద్దాయిగా ఉన్న రేవంత్ రెడ్డి బెయిల్ మంగళవారం మంజూరైంది.. కానీ కొన్ని సాంకేతిక లోపాల వల్ల బుధవారం సాయంత్రం ఆయన విడుదల అయ్యారు. ఇక ఈ కేసులో ఏసీబీ తో దోబూచులాడుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఆ మద్య ఏసీబీ నోటీసులు  జారీ చేశారు. కానీ అనారోగ్యం కారణాల వల్ల ఆయన విచారణకు రాలేక పోతున్నానని లేఖ రాశారు.

తెలంగాణ ఏసీబీ


విచారణ గడువు ముగిసినా సండ్ర మాత్రం ఏసీబీ ఎదుట హాజరు కాలేదు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ అధికారులు శనివారం మళ్లీ నోటీసులు జారీ చేశారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలలోగా విచారణకు రావాలని ఆదేశించారు. సండ్ర ఇంటికి వెళ్లిన అధికారులు... ఆయన లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించారు.  తాను ఖమ్మంలోని తన ఇంట్లో ఉన్నానని ఎమ్మెల్య సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. ఏసిబి ఇచ్చిన గడువులోగా హాజరవుతానని వెల్లడించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: