రాజకీయాలు, గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా.. చంద్రబాబును మంచి అడ్మినిస్ట్రేటర్ అని చాలామంది చెప్పుకుంటారు. ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ రంగాల్లో బాబు తర్వాతే ఎవరైనా అని టీడీపీ నాయకులు గొప్పలు చెప్పుకుంటారు. వాళ్లు చెప్పుకున్నంత కాకపోయినా.. చంద్రబాబు పాలనాదక్షత మెచ్చుకోదగిందే. 

ఐతే.. లేటెస్టుగా ఆయన గోదావరి పుష్కరాల నిర్వహణ విషయంలో బాగా ఫెయిలైనట్టు కనిపిస్తోంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత.. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న తొలి పుష్కరాలు కావడంతో ఘనంగా చేస్తారని అంతా భావించారు. ప్రభుత్వం కూడా నిధులు బాగానే కేటాయించింది. 

పుష్కరాల విషయంలో ఏదీ పాలనాదక్షత..?


కానీ పుష్కరాల పనులు మాత్రం అనుకున్నంత బాగా జరగడం లేదు. ఈనెల 14 నుంచి 25 వరకూ గోదావరి పుష్కరాలు నిర్వహిస్తున్నారు. కానీ ఇంతవరకూ ఘాట్ల నిర్మాణం పూర్తిగా ఓ కొలిక్కిరానేలేదు. ఇంకా పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. పట్టుమని పది రోజులు కూడా లేకపోయినా పనుల్లో వేగం కనిపించడం లేదు. 

చివరి నిమిషంలో హడావిడిగా చేసే పనులు ఎంత నాణ్యంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. మరి పుష్కరాలు ఉన్న సంగతి ముందే తెలిసినప్పుడు జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సిన ముఖ్యమంత్రి ఏం చేసినట్టు.. ముందుగా అనుకున్న కార్యక్రమాలు కూడా సమర్థవంతంగా నిర్వహించలేకపోతే.. చంద్రబాబు పాలన దక్షత ఏమైనట్టు.. అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: