రాష్ట్రంలో తను పర్యటను సాగించే సందర్భాల్లో  వినియోగించేందుకు తెంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ. 5కోట్ల వ్యయంతో ఓ బస్సును తెప్పించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే కేవం ఒకే ఒక్కరోజు దానిని వాడేసరికి సారుకు మొహం మొత్తినట్లుగా ఉంది. అందులో మార్పు చేర్పును సూచిస్తూ తిరిగి షెడ్డుకు పంపారు. అందులో సీటింగ్‌ ఎరేంజిమెంటును మాత్రం మార్చాల్సిందిగా సీఎం కేసీఆర్‌ చెప్పారని, ఆ మార్పు కోసం తిరిగి బెంజి వర్క్‌షాపునకు పంపామే తప్ప.. అందులో భద్రత పరమైన వైఫల్యాు ఏమీ లేవని అధికాయి చెబుతున్నారుట. 
నాయకు తమ యాత్ర కోసం సక సౌకర్యాతో కూడిన బస్సును వాడుకునే సాంప్రదాయం చాన్నాళ్ల కిందటే మొదయింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర సాగించినప్పుడే ఆయన కోసం ప్రత్యేకంగా ఒక బస్సును రూపొందించారు. పాదయాత్రలో ఎక్కడ రాత్రి బస చేయాల్సి వస్తే అక్కడ ఆయన ఆ బస్సులోనే విశ్రమించేవారు. బెడ్‌రూం, బాత్రూం సదుపాయాు ఉండేలా ఆ బస్సు డిజైన్‌ ఉండేది. ఆ తర్వాతి కాంలో చంద్రబాబు కూడా అదే మాదిరి అత్యాధునిక సదుపాయాతో, సాంకేతిక సదుపాయాతో ఓ బస్సును తయారు చేయించుకున్నారు. అది తొగుదేశం పార్టీకి చెందిన బస్సు. ఇటీవలే కేసీఆర్‌ వంతు వచ్చింది. ఆయన బస్సును మాత్రం తెంగాణ ఆర్టీసీ కొనుగోు చేసింది. టీఎస ఆర్టీసీ అయిదుకోట్ల రూపాయ మివైన ఈ బస్సును ముఖ్యమంత్రి కోసం తయారుచేయించింది. ఇందులోనూ అత్యాధునిక సదుపాయాు అన్నీ ఉంటాయి. ఉత్తమశ్రేణి భద్రత ఏర్పాట్లు అన్నీ ఉంటాయి.
కొన్ని రోజు కిందటే యాదగిరి గుట్టలో ప్రత్యేక పూజు చేయించిన తర్వాత.. ముఖ్యమంత్రి ఈ బస్సును వినియోగించడం ప్రారంభించారు. అయితే ఒక్కరోజు వాడేసరికే అందులో కొన్ని ఏర్పాట్లు ఆయనకు రుచించలేదని తొస్తోంది. బన్సులో ఉన్న సీటింగ్‌ ఏర్పాట్లు మార్చాని సూచించారుట. అయినా ఇన్ని కోట్ల రూపాయు సెవుచేసి, బస్సును చేయిస్తున్నప్పుడు.. సీటింగ్‌ ఏర్పాట్లు ఎలా ఉంటాయో వాడబోయే ముఖ్యమంత్రికి ముందుగా తెలియజెప్పకుండానే చేశారా అని జనం విస్తుపోతున్నారు. అయితే ఈ బస్సు మీద సీఎం కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారని, కొన్ని పుకార్లు వస్తున్నాయి. 
ప్రస్తుతానికి బెంజి వర్క్‌షాప్‌కు వెళ్లిన ఈ బస్సు ఎన్ని రోజుల్లో తిరిగి కేసీఆర్‌ వినియోగించేలా వాడుకలోకి వస్తుందనేదాన్ని బట్టి, కేవం సీట్లు మార్చడమేనా.. సీఎం మరిన్ని సదుపాయాు  ఉండాంటూ సూచించారా అనేది అర్థమవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: