తెలుగు రాష్ట్రాలో పెను సంచలనం సృష్టించిన ఓటు కు నోటు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. ముడుపుల వ్యవహారం వెలుగులోకి వచ్చాక స్టీఫెన్‌సన్‌ ఓటు విక్రయానికి సహకరించినట్లు భావిస్తున్న జెరూసలెం మత్తయ్యను తెలంగాణ ఏసీబీ అధికారులు నాలుగో నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే.  నామినెటెడ్‌ ఎమ్మెల్యే పదవి ఇచ్చేందుకు స్టీఫెన్‌సన్‌ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు.తర్వాత కొందరు వ్యక్తులు మత్తయ్య ఇంటికి వెళ్లి ఆయన భార్యను దుర్భాషలాడి, అతని సోదరుడు ప్రభుదా్‌సను చితకబాదారు. దీనిపై విజయవాడ పోలీసులకు మత్తయ్య ఫిర్యాదు చేశారు.

స్టిఫెన్ సన్, రేవంత్ రెడ్డి


కేసీఆర్ కి, స్టిఫెన్ సన్ ల  విషయాన్ని వెల్లడిస్తానన్న భయంతో తన సోదరుడు, భార్యపై గుర్తు తెలియని వ్యక్తులతో దాడి చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని బెజవాడ పోలీసులకు విన్నవించారు.  నోటుకు ఓటు కేసులో నాలుగో నిందితుడు జెరూసలెం మత్తయ్య సోదరుడిపై దాడి చేసింది హైదరాబాద్‌ పోలీసులేనని ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు గుర్తించినట్లు చెబుతున్నారు. అయితే న్యాయపరమైన చిక్కులు రాకుండా ముందుకెళ్లాలన్న పోలీసు ఉన్నతాధికారుల సూచనతో సీఐడీ అధికారులు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ ఘటన జరిగింది అంతా హైదరబాద్ లో కాబట్టి ఏపీ ప్రభుత్వం కేసును సీఐడీకి అప్పగించింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్


మత్తయ్య, ఆయన భార్య, సోదరుడు ప్రభుదాస్‌ నెంబర్లకు మే చివరి వారం నుంచి జూన్‌ మొదటి వారం వరకు వచ్చిన కాల్స్‌ డేటాను సీఐడీ అధికారులు సేకరించారు. అందులో కొన్ని నంబర్లు టీఆర్‌ఎస్‌ కార్యకర్తల పేరుతో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే వీరిపై చర్యలు తీసుకునేందుకు ఏపీ సీఐడీ సమాయత్తమవుతున్నట్లు తెలిసిందంటూ వార్తలు వచ్చాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: