వర్షాకాలం విడిధి కోసం రాష్ట్రపతి  ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్,  బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి విచ్చేసిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి నిలయంలో విడిది చేసిన భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఆదివారం రాత్రి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.  జగన్ వెంట వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు.  

మర్యాద పూర్వకంగా   రాష్ట్రపతిని కలిసిన వైఎస్ జగన్


ఈ సందర్భంగా జగన్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్ధితులను వివరించారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పరిస్థితిని వివరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేయాలని కోరారు. ఓటుకు నోటు స్కాం, ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. చంద్రబాబు ఎన్నికలు ముందు ఇచ్చిన హామీలు, ఆ తర్వాత వాటిని అమలు చేయకపోవడంతోపాటు ఇటీవల హైదరాబాద్ ఉమ్మడి రాజధానిలో తలెత్తిన సెక్షన్ 8 అంశం వివాదాలు అంశాల గురించి పార్టీ అభిప్రాయాలను రాష్టప్రతికి నివేదించినట్లు సమాచారం. కాకపోతే  జగన్ మర్యాదకపూర్వకంగా రాష్టప్రతిని కలిసినట్లు వైకాపా వర్గాలు పేర్కొన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: