తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాల్లో ఇంత వరకు నోరు మెదపలేదు.. కాకపోతే ఆ మద్య ఈ విషయాలపై త్వరలో స్పందిస్తానని తన ట్విట్టర్ లో పెట్టాడు. ఈ విషయాలపై ఈ రోజు ఆయన తన మనోభావాలు మీడియా ముందు ఉంచారు. తనకు అభిప్రాయాలు ఉన్నాయని,కాని కావాలని మాట్లాడలేదని జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ అన్నారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల సీఎం లు బాధ్యతగా వ్యహరించాలి. గతనెల రోజులుగా పాలన గురించి మర్చిపోయారు, రెండు ప్రభుత్వాలు కేసులంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు


నాయకులు నోరు పారేసుకుంటే ప్రజలకు అనర్థం. రాష్ట్రాలు రెండుగా విడిపోయాయి కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మాట్లాడాలి. తెలుగు జాతి ఐక్యతకు కేసీఆర్ మొట్టమొదట అడుగు వేసినట్లు కనిపిస్తుంది. యాదాద్రికి విజయనగరం జిల్లాకు చెందిన ఆనంద్ సాయిని ఆర్కిటెక్ట్ గా పెట్టుకోవడాన్ని అభినందిస్తున్నానని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీరియస్ గా తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుత రాజకీయాల్లో నీతి, నిజాయితీలకు ఆస్కారం లేదు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి వ్యవహారం తప్పా, ఒప్పా కోర్టు నిర్ణయిస్తుందని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: