రెండు రోజుల్లో స్పందిస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ కాస్త ఆలస్యంగా సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడాడు. పవన్ అన్ని విషయాలపై మాట్లాడతానని ముందే ప్రకటించడంతో అభిమానులతో సహా అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఇక మీడియా ఈ విషయంలో మరింత ఆసక్తి కనబరిచింది. పవన్ మాట్లాడటం కూడా మొదలుపెట్టకుండానే లైవ్ ఇవ్వడం మొదలుపెట్టారు. 

ఐతే.. పవన్ ప్రసంగం ఆశించిన స్థాయిలో లేదు. రేవంత్ రెడ్డి 5లక్షలు లంచమిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం, చంద్రబాబు ఆడియో టేపుల్లో దొరకడం, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలపై పవన్ హాట్ గా స్పందిస్తాడని ఆశించారు. కానీ.. రాజకీయాల్లో అవినీతి ఎక్కడ లేదు అన్న తరహాలో పవన్ మాట్లాడటం నిరాశ పరిచింది. రెడ్ హ్యాండెడ్  గా దొరికిపోవడాన్ని కూడా అది పెద్ద విషయం కాదన్నట్టుగా పవన్ మాట్లాడటం విశేషం. 

పవన్ మరోసారి నిరాశ పరిచాడా..?


ఓటుకు నోటు కేసుపై సాఫ్ట్ గా స్పందించిన జగన్.. ఫోన్ ట్యాపింగ్ విషయంపై మాత్రం నిర్మోహమాటంగా, ఘాటుగా స్పందించాడు. ఫోన్ టాపింగ్ సీరియస్ విషయం అని, అందులోను సీఎం ఫోన్ టాప్ అవడం తీవ్రమైన అంశమని అన్నాడు. అంతే కాదు.. దీనిపై సిబిఐ విచారణ కూడా జరగాలని డిమాండ్ చేశాడు పవన్. తెలుగుదేశం పార్టీని కాని, ఆ పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు గురించి కాని ఎక్కడా వ్యతిరేక వ్యాఖ్యలు చేయకపోవడం విశేషం.
 
సెక్షన్ 8 పై మాత్రం పవన్ స్పష్టమైన అభిప్రాయం చెప్పాడు. తాను ఈ సెక్షన్ కు వ్యతిరేకమని కుండబద్దలు కొట్టాడు. ఇప్పటికే ఆంధ్రాకు అన్యాయం చేసిన కేంద్రం.. సెక్షన్ 8 ద్వారా తెలంగాణకు కూడా అన్యాయం చేస్తోందని కామెంట్ చేశాడు. ఆంద్రావాళ్లంతా టిడిపిలో ఉండరని, చంద్రబాబు సామాజికవర్గం ఒక్కటే కాదని, అనేక కులాలు, సమ్మేళనాలు ఉన్నాయని అన్నారు. అయితే అనేక అంశాలపై తాను ఇంకా ఒక అభిప్రాయానికి రావాల్సి ఉందని.. తాను ఇంకా రాజకీయాలకు కొత్త అని కామెంట్ చేయడం ద్వారా పవన్ తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని అనిపిస్తోంది. పార్టీ పెట్టి ఏడాదిన్నర కావస్తున్నా..ఇంకా తనకు అవగాహన లేదు, అభిప్రాయాలు లేవు అంటున్న పవన్.. రాజకీయాల్లో ఎలా నెగ్గుకొస్తారో మరి. 



మరింత సమాచారం తెలుసుకోండి: