గత ఎన్నికల ముందు హడావిడిగా పార్టీ పెట్టినా పవన్ రాజకీయ జీవితం ఆటలో అరటిపండు తరహాలో సాగుతోంది. గతంలోనూ రాజకీయాల్లోకి వచ్చిన నటులున్నారు. కానీ ఇలా పార్ట్ టైమ్ పొలిటీషియన్స్ లా మాత్రం ఎవరూ లేరనే చెప్పాలి. ఆ విషయంలో దేశంలోనే పవన్ కల్యాణ్ కొత్త ఒరవడి సృష్టించారని చెప్పుకోవచ్చు. 

ఎన్నికల ముందు పార్టీ పెట్టినా.. పోటీకి మాత్రం అభ్యర్థులను నిలపలేదు. టీడీపీ, బీజేపీ కూటమి గెలుపుకోసమే ఆయన పని చేశారు. పోనీ.. ఎన్నికల తర్వాతైనా ఫుల్ టైమ్ పాలిటిక్స్ నడుపుతున్నారా అంటే అదీ లేదు. మూడు నెలలకో, ఆరు నెలలకో  ఓ పర్యటన.. నెలకో రెండు నెలలకో ఓ ప్రెస్ మీట్.. అడపాదడపా ట్వీట్లు.. ఇదీ పవన్ రాజకీయం. 

పవన్.. ఏడాదికోసారి రిలీజయ్యే సినిమా.. 


కాకపోతే ఈయన వల్ల ఎవరికీ పెద్ద నష్టం లేదు కాబట్టి.. పవన్ ను ఎవరూ అంత సీరియస్ గా తీసుకోవడం లేదు. ఇలా ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మాత్రం.. అందుకు సంబంధం ఉన్న వ్యక్తులు పొలిటికల్ రియాక్షన్లు ఇస్తున్నారు. లేటెస్టు ప్రెస్ మీట్లో ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వంపై కొన్ని విమర్శలు చేశారు. కొందరు మంత్రులు ఆంధ్రోళ్లని తిడుతున్నారని.. సెక్షన్ 8 రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ సర్కారుదేనని.. అన్నారు. 

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. పవన్ కళ్యాణ్ సినిమా వ్యక్తి కావడంతో కేటీఆర్ కూడా సినిమా భాషలోనే విమర్శలు గుప్పించారు. పవన్ విమర్సలు.. ఏడాదికో మారు రిలీజయ్యే సినిమా లాంటిదని సెటైర్ వేశారు. అలాంటి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాట్లాడాల్సినవసరం కూడా లేదన్నారు. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని కామెంట్ చేశారు కేటీఆర్. 



మరింత సమాచారం తెలుసుకోండి: