అందమైన అమ్మాయిని చూస్తే ఎలాంటి మగాడైనా డంగవ్వాల్సిందే. దానికి ఎలాంటి మినహాయింపులూ లేవు.. అందుకే.. బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు.. ఎంతవారలైనా కాంతాదాసులే.. 
వంటి సామెతలు పుట్టుకొచ్చాయి. అందులోనూ అమ్మాయే కాల్ చేసి ప్రేమగా మాట్లాడి ముగ్గులోకి దింపతే దిగని మగాడుంటారా.. ?

మగాళ్లలోని ఈ బలహీనతను కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. పోలీసులు వ్యభిచార ముఠాలను పట్టుకోవడం.. మీడియా హడావిడి చేయడం మామూలే. ఇలా మీడియా ముందు దొరికిపోయే మగాళ్లు తమ పేరూ, ఊరూ బయటకు రాకుండా చూసుకుంటారు. తమ ముఖం మీడియాలో కనిపించకుండా తాపత్రయపడతారు. అందరిలో పరువు పోతుందని భయపడతారు. 

అమ్మాయి కోసం ఆశ పడితే.. అంతే సంగతులు.. 
media
వరంగల్ లోని ఓ ముఠా.. ఇలా మీడియా ముసుగులో ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున సొమ్ము గుంజుతోంది. అందుకు కొందరు అమ్మాయిలను వాడుకుంటున్నారు. ముందుగా కొందరు ప్రముఖులను సెలక్ట్
చేసుకుంటారు. వారి ఫోన్ నంబర్లకు అమ్మాయిలతో ఫోన్ చేయిస్తారు. అలా అమ్మాయిలతో పరిచయం  పెరిగేలా చేసి.. రాసలీలలకు ఉసికొల్పుతారు. ప్రముఖుల ఇంటికి అమ్మాయిలను పంపడం కానీ.. లాడ్జిలకు కానీ పిలిపిస్తారు. 

అమ్మాయిలతో ప్రముఖులు రాసలీల మొదలుపెట్టగానే కెమేరాలతో నకిలీ మీడియా రంగప్రవేశం చేస్తుంది. ప్రముఖుల, అమ్మాయిల దృశ్యాలు, మాటలు రికార్డు చేస్తారు. ఆ తర్వాత అవన్నీ మీడియాలో ఇస్తాం.. లేకుండా అడిగినంత ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. పరువుకు భయపడిన ప్రముఖులు వారు అడిగినంత ముట్టజెప్పుకుని బయటపడతారు. ఇలా మీడియా ముసుగులో ప్రముఖులకు యువతులను ఎరగా వేసి వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను వరంగల్ పోలీసులు అరెస్టుచేశారు. ఇలా ఇప్పటివరకూ 20 లక్షల వరకూ వసూలు చేశారట. ఓ టీచర్‌ను బ్లాక్‌మెయిల్ చేసి బెదిరించే క్రమంలో పోలీసులకు దొరికిపోయారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: