గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు వ్యవహారంలో ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఢీ అంటే ఢీ అనుకునే పరిస్థితి నెలకొంది. తాజాగా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు  మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరు మంత్రులు ఓటుకు నోటు వ్యవహారంలో తెలుగు రాష్ట్ర ప్రజల మద్య విద్వేశాలను రెచ్చ గొడుతున్నారని ఆరోపించారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్


ఒకవేళ ఇద్దరి మద్య అండస్టాండింగ్ లేకుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబానికి చెందిన 'నమస్తే తెలంగాణ' పత్రికకు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి చెందిన హెరిటేజ్ సంస్థ ఒక ప్రకటన ఇచ్చింది. దీనిపై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ మండిపడ్డారు.దీన్ని బట్టే ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఉన్న సంబంధాలు అర్థమవుతున్నాయని అన్నారు. ఇక ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పును ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించడం సరికాదని షబ్బీర్ అలీ అన్నారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చాలని చూస్తే తాము ఉద్యమిస్తామన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: