తెలుగు రాష్ట్రల్లో నెలకొన్న గొడవలు ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 పై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ సోమవారం ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరు రాష్ట్ర సీఎంలను ఏకి పారేశారు. ప్రజల మద్య సాన్నిహిత్యం, స్నేహభావం పెంపొందించాల్సింది పోయి వారి మద్య అభద్రత భావం, విద్వేశాలు సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. సెక్షన్ 8 కు తాను పూర్తిగా వ్యతిరేకమని ఇప్పుడున్న పరిస్థితిలో అది అవసరమే లేదని అన్నారు.

తెలంగాణ సాధన సమయంలో కాంగ్రెస్ ఎంపీలు (ఫైల్)


ఇక ప్రత్యేక హోదా విషయమై ఏపీ ఎంపీలు కడిగి పారేశారు, ఏపీ ఎంపీలు తెలంగాణ ఎంపీలను చూసి చాలా నేర్చుకోవాలని వారు పార్లమెంట్ లో ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతగానో పోరాడారని అప్పట్లో వారిని పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేసినా వారు వెనక్కి తగ్గలేదని అలాంటి తెగువ చూపించడం వల్లే తెలంగాణ సాధ్యమైందని పొగిడారు. మరి ఇక్కడ ఎంపీలు ప్రత్యేక హోదా పై గట్టిగా మాట్లాడలేక పోతున్నారని అంతే కాదు విభజన సమయంలో కూడా ఆంధ్రా ఎంపీలు  గట్టిగా మాట్లాడలేక పోయారని నిజానికి వారు మాట్లాడే పరిస్థితిలో లేరని ఎందుకంటే వారికి సొంత వ్యాపారాలు ఉండటమే కారణమని విమర్శించారు.


టీడీపీ లీడర్స్


ప్రత్యేక హోదా విషయమై ఏపీ ఎంపీలు మాట్లాడటం లేదని సోమవారం ప్రెస్ మీట్లో చెప్పిన పవన్ వారిపై మండిపడ్డారు. ఎంపీలు కొనకళ్ల నారాయణ, కేశినేని నానిలు   పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇవ్వనున్నారు.మద్దతిచ్చినంత మాత్రాన పవన్ కళ్యాణ్ విమర్శిస్తే సహించేది లేదని చెబుతున్నారు.  వ్యాపారాలు చేసుకోవడానికే పదవా, అయితే రాజీనామా చేయండి అంటూ ఘాటుగా పవన్ వ్యాఖ్యానించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తమకు మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్‌కు, టీడీపీకి ఇక వార్ ప్రారంభమైనట్లుగానే పలువురు భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: