ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు 14 రోజుల రిమాండ్ ను ఏసీబీ న్యాయస్థానం విధించింది. సోమవారం ఉదయం ఏసీబీ ముందు హాజరైన సండ్రను ఏడుగంటల పాటు విచారించిన ఏసీబి ఆయనను సాయంత్రం అరెస్టు చేసింది. ఈ రోజు ఆయనకు ఆరోగ్య పరిక్షలు నిర్వహించిన తర్వాత కోర్టు ముందు హాజరు పరిచారు ఏసీబీ. తాజాగా ఈ కేసులో సండ్రను ఏ5 నిందితుడిగా చేర్చినట్లు సమాచారం. మరోవైపు, సండ్రను విచారణ కోసం తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓటుకు నోటు కేసులో అరెస్టైన సండ్ర వెంకట వీరయ్య రిమాండ్ నివేదికలో ఏసీబీ కీలక విషయాలు పొందుపర్చిందని తెలుస్తోంది.

టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

a40

ఈ కేసులో ఏ2గా ఉన్న సెబాస్టియన్‌తో సండ్ర 32 సార్లు ఫోన్‌లో మాట్లాడారని, స్టీఫెన్ సన్‌ను ప్రభావితం చేసే కుట్రలో సండ్ర కీలక పాత్ర పోషించారని పేర్కొంది. కాసేపట్లో సండ్రను చర్లపల్లి జైలుకు తరలించనున్నారు. ఈ నెల 21 వరకు సండ్ర రిమాండ్ కొనసాగుతుంది.తాజాగా ఈ కేసులో సండ్రను ఏ5 నిందితుడిగా చేర్చినట్లు సమాచారం.   సండ్రను విచారణ కోసం తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తెలంగాణ ఏసీబీ


 మరోవైపు, సండ్రను విచారణ కోసం తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  దింతో కౌంటర్ దాఖలు చేయాలని సండ్ర తరపు లాయర్లకు కోర్టు సూచింది. దీంతో, సండ్ర తరపు లాయర్లు కౌంటర్ దాఖలు చేశారు. సండ్ర ఆరోగ్య పరిస్థితి పరిగణలోకి తీసుకొని ఆయనకు   జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: