గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటులో కేసు తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో సెక్షన్-8 అమలు, తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడడంపై ఏపీ మంత్రులు మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి నేతృత్వంలో ఏపీ మంత్రులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు.

విభజన చట్టంలోని సెక్షన్ 8ని తప్పనిసరిగా అమలు చేయాలని వారు విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. 120 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లుందని, ఎంపీ గరికపాటి, సెబాస్టియన్ ఫోన్ ట్యాపింగ్ ఆధారాలను రాష్ట్రపతికి ఇచ్చామని వారు తెలిపారు.ఏపీ పట్ల తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఫిర్యాదు చేశారు.ఉమ్మడి సంస్థలపై తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్నతీరుపై రాష్ర్టపతికి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈ భేటీలో బొజ్జల, అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి, రావెల, మంత్రులతో పాటు సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: