జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ సోమవారం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నరాజకీయ పరిస్థితుల తీరుపై... ఫోన్ ట్యాపింగ్, ఓటుక నోటు, సెక్షన్ 8, సీమాంధ్రకు ప్రత్యేక హోదా తదితర అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు  ప్రజల విషయం పక్కన బెట్టి ఏసీబీ, కోర్టులు అంటూ తిరుతుగున్నారు అని విమర్శించారు. సెక్షన్ 8 కి తను పూర్తి వ్యతిరేకమని ఇక రెండు రాష్ట్రా ప్రజల మధ్య తీవ్రతరమైన కొట్లాటలు, కుమ్ములాటలు సంబవిస్తే తప్ప.. ఫోన్ ట్యాపింగ్ అయిందని, చంద్రబాబు కేసు గురించి సెక్షన్ 8 అమలు పరచరు అని అన్నారు.

ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నజనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్


ఇక ఏపీ ఎంపీలు వ్యాపారస్తులే తప్ప ప్రజల గురించి పార్లమెంట్ లో మాట్లాడరు అనే విధంగా మాట్లాడారు. దీనిపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ఈ రోజు తీవ్రంగా స్పందించారు.. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆరు నెలలకు ఒకసారి లేచి జూలు విదిల్చినట్టు... ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడి మళ్లీ నిద్రావస్థలోకి వెళ్లి ఆరునెలల తర్వాత మళ్లి రావటం ఆయనకు అలవాటని వాస్తవాలు గమని మాట్లాడాలని అన్నారు. హైదరాబాద్‌లో సెక్షన్‌-8 అవసరం లేదని చెప్పడం సరికాదని కేశినేని నాని అన్నారు. చిరంజీవి కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర విభజన జరిగిందని... కామన్‌ రాజధానిగా పదేళ్లు ఉందని, అన్ని రకాల హక్కులు హైదరాబాద్‌పై ఏపీకు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ


మరి హైదరాబాద్ లో ఏపీ ప్రజలకు, ఏపీ రాజకీయ ప్రతినిధులకు రక్షణ లేకుండా పోయింది, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, ముఖ్య అధికారుల ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తుంటే... హైదరాబాద్‌లో శాంతి భద్రతల సమస్యలు పవన్‌కు కనిపించడంలేదా?... సెక్షన్‌ 8 అమలు వద్దని ఎలా అంటారని నాని ప్రశ్నించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: