చర్మ సమస్యలకు, అధిక మొత్తంలో ఉత్పత్తి చెందే నూనెల వలన ముఖ చర్మం జిడ్డుగా కనపడుతుంది. ఈ సమస్యలను తగ్గించుకొని, చర్మ అందాన్ని మెరుగుపరచుకొటానికి చాలా రకాల ఇంట్లో ఉండే ఔషదాలు అందుబాటులో ఉన్నాయి. వేసవికాలంలో ఏర్పడే జిడ్డు సమస్యలను తగ్గించుకోటానికి మీరు చాలా రకాల క్రీమ్ లను పద్దతులను వాడి ఉంటారు. కానీ, ఇప్పటికి ఈ సమస్యతో భాదపడుతూనే ఉన్నారా..! ఈ చిట్కాలు పాటించండి..!!


గుడ్డు పచ్చసొన, ముఖ చర్మంపై ఉండే నూనెలను తొలగించే సులువైన పద్దతిగా చెప్పవచ్చు. ఈ సమస్యను తగ్గించుకోటానికి సేకరించిన గుడ్డు పచ్చసొనను, కాటన్ బాల్ తో మాత్రమే, జిడ్డుగా అనిపించే ప్రాంతాలలో పూసి, 15 నిమిషాల పాటూ అలాగే ఉంచాలి. తరువాత చల్లటి నీటితో కడిగివేయాలి.

కలబంద వలన కలిగే ప్రయోజనాలు మరియు కలిగి ఉండే గుణాల పట్ల దీనిని "అద్భుత వృక్షంగా" పేర్కొంటారు. కలబంద నుండి సేకరించిన పదార్థాలు, చర్మంపై ఉండే నూనెలను గ్రహించుకుంటాయి. కలబంద నుండి తీసిన గుజ్జును, రోజులో 3 సార్లు ముఖానికి రాసి, ఎండే వరకు వేచి ఉండండి. వేసవికాలంలో కలబంద ఆకులను ఫ్రిజ్ లో ఉంచి, వాడటం వలన ఇది మరింత శక్తివంతంగా పని చేస్తుంది.

ముఖ చర్మంపై నిర్జీవ కణాలను మరియు వేసవిలో ఉత్పత్తి చెందే నూనెలను తొలగించటానికి బాదం- తేనెల మిశ్రమం సమర్థవంతంగా పని చేస్తుంది. ఈ పేస్ట్ ను, వేడి నీటితో శుభ్రపరచిన బట్టతో మాత్రమే, ముఖానికి పూయాలి. ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతాలలో పూసిన తరువాత, కొద్ది సమయం పాటూ ఉంచి నీటితో కడిగివేయాలి.

నిమ్మకాయలు పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉంటాయి. సమాన మొత్తంలో నిమ్మరసాన్ని మరియు నీటిని తీసుకొని, రెండింటిని కలిపి, పూర్తి ముఖానికి పూయండి. ముఖానికి పూసిన తరువాత ఒకటి లేదా రెండు నిమిషాల పాటూ ఉంచి, వేడి నీటితో కడిగి వేయటం ద్వారా, ముఖ చర్మంపై ఉండే అన్ని విష పదార్థాలు మరియు నూనెలు వెంటనే తొలగిపోతాయి. తరువాత తిరిగి చల్లటి నీటితో ముఖాన్ని కడిగి వేయండి.

సిట్రస్ జాతికి చెందిన పండ్లు ముఖ్యంగా నిమ్మ, ముఖ చర్మంపై ఉండే నూనెలను తొలగిచుటలో శక్తి వంతంగా పని చేస్తుంది. సమన మొత్తంలో నిమ్మరసం మరియు దోసకాయ రసం కలిపిన మిశ్రమం చర్మంపై ఉండే జిడ్డును తొలగించటలో శక్తివంతంగా పని చేస్తుంది. స్నానానికి వెళ్ళే ముందు ముఖానికి పూసి, కొద్ది నిమిషాల వేచి ఉండి, నీటితో కడిగి వేయండి.

చాలా శాతం వరకు జిడ్డు చర్మాన్ని ఇంట్లోనే చికిత్స జరిపించుకోవచ్చు. అంతేకాకుండా, ఈ ఔషదాల వలన మంచి ఫలితాలను కూడా పొంద వచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: