రాజకీయ నాయకులకు వ్యాపారాలుంటాయి. రాజకీయ నాయకులకు పత్రికలూ ఉంటాయి. ఇప్పుడు రాజకీయాలు, వ్యాపారాలు కలసిపోయాయి. అలాగే వ్యాపారాల కోసం పత్రికావిలువలనూ మంటగలిపేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ విషయం వెలుగు చూసింది. 

రోజూ చంద్రబాబును ఆంధ్రాబాబు అని దుమ్మెత్తిపోసే నమస్తే తెలంగాణ పత్రికలో చంద్రబాబుకు చెందిన కంపెనీ హెరిటేజ్ వ్యాపారప్రకటన మొదటి పేజీలో కనిపించింది. అందులోనూ మరో విశేషం ఏమిటంటే.. ఈ యాడ్ నమస్తే తెలంగాణ పత్రికలో తప్ప ఇతర పత్రికల్లో ఎక్కడా కనిపించకపోవడం. చంద్రబాబు తీరుపై.. చివరకు ఆయన కంపెనీ హెరిటేజ్ తీరుపైనా నమస్తే తెలంగాణ గతంలో ఎన్నో వార్తలు రాసింది. 

కేసీఆర్ నెత్తిన బాబు హెరిటేజ్ పాలు.. 

Image result for kcr chandrababu
చంద్రబాబు- కేసీఆర్ మధ్య డీల్ కుదిరిందనడానికి ఇంతకు మించి సాక్ష్యం అవసరం లేదంటున్నాయి ప్రతిపక్షాలు. కేసీఆర్, చంద్రబాబు తమ రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజలను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. మన పత్రిక మన ఆత్మగౌరవం అని ట్యాగ్ లైన్ పెట్టుకున్న కేసీఆర్ పత్రిక నమస్తే తెలంగాణ.. చంద్రబాబు కంపెనీ యాడ్ వేయడం ఆశ్చర్యపరిచేదే.    
 
కేసీఆర్ బెదిరింపులకు లొగేది లేదని చెప్పే చంద్రబాబు, లోకేశ్.. తమ కంపెనీ యాడ్ మాత్రం కేవలం నమస్తే తెలంగాణకు మాత్రమే ఎందుకిచ్చారన్న సంగతి అర్థం కాని విషయం. చంద్రబాబుకు కేసీఆర్ ప్రభుత్వం నోటీసులిస్తే.. ఆయన నెత్తిన పాలుపోసినట్టే.. అని చెప్పిన లోకేశ్.. తమ కంపెనీ పాల ధర తగ్గించామన్న ప్రకటన మాత్రం కేవలం కేసీఆర్ మీడియాకు మాత్రమే ఇవ్వడం ఆలోచించదగ్గ విషయమే. ఏదైనా వ్యాపారం.. వ్యాపారమే..రాజకీయం రాజకీయమే అని ఎవరైనా సరిపెట్టుకోవచ్చు కానీ.. ఈ విషయం చూస్తే మాత్రం ఏదో రాజీ వ్యవహారం కుదిరినట్టే కనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: