ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఏమిటి? ఆ పార్టీ ఏ మతానికి అనుబంధంమైనదిగా ముద్ర పడి ఉన్నది? అనే చవకబారు ప్రశ్నలను కాసేపు పక్కనపెడదాం. ఒక జాతి ఉన్నతి కోసం ఒక ప్రభుత్వం కొన్ని కొత్త ఆలోచనలను, సంప్రదాయంలో లేనివి అయినా సరే.. ప్రవేశపెట్టదలచుకున్నప్పుడు.. వాటిని సరైన రీతిలో అవగాహన చేసుకుని ఆదరించాలా వద్దా? ఎవరైనా సరే.. ఆదరించాలనే అంటారు. కానీ.. ముస్లిం మత పెద్దలు మాత్రం తద్భిన్నంగా, వ్యతిరేకిస్తూ ఉండడం విశేషం. 

ముస్లిం మత విద్యను బోధించే మదర్సాలలో మత పరమైన విశేషాలనే సాధారణంగా చెబుతారు. ఇక్కడ చదువుకునే వారు మతపరమైన కార్యక్రమాలు నిర్వహించే వృతి ఉద్యోగ ఉపాధులను పొందడంలో తర్ఫీదు అవుతారు. అయితే మహారాష్ట్రలోని దేవేంద్ర ఫడ్నవీస్‌ నేతృత్వంలోగల భాజపా ప్రభుత్వం ఓ కొత్త నిబంధనతెస్తోంది. మదర్సాల్లో ఇంగ్లిషు, లెక్కలు, సైన్సు కూడా బోధించాలని అంటోంది. అలా చేయకుంటే మదర్సాల గుర్తింపును రద్దు చేస్తాం అని కూడా హెచ్చరిస్తోంది. ఈ నిర్ణయాన్ని మహారాష్ట్రంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాదు ఎంపీ ఒవైసీ తప్పు పడుతున్నారు.

మదర్సాలపై పాఠ్యాంశాలను రుద్దలేరు అంటూ ఆయన సెలవిస్తున్నారు. అయితే ముస్లిం మత పెద్దలు, ఒవైసీ వంటి నాయకులు ఎందుకు దీనిని వ్యతిరేకిస్తున్నారో మాత్రం అర్థం కావడం లేదు. ఒవైసీ సోదరులు ఇద్దరూ చక్కగా ఇంగ్లిషు చదువుకున్నారు. విదేశాలకు వెళ్లి మరీ చదువుకుని వచ్చారు. అదే తాము మాత్రం.. ఇంగ్లిషును మేధావుల రేంజిలో చదువుకుని.. తమ మతంలో.. మతవిద్యను అభ్యసించే వారు మాత్రం చదువుకోకూడదన్నట్లుగా నిబంధనలు ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారో అర్థం కాని సంగతి. లెక్కలు, సైన్సు అనేవి మత వ్యతిరేక విషయాలనేమీ బోధించవు. అవి ప్రాథమికంగా ప్రాపంచిక జ్ఞానాన్ని అందిస్తాయి. అలాంటప్పుడు వీరు దానిని కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: