తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలు ఓటుకు నోటు, సెక్షన్ 8, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై ‘జనసేన’ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాన్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా సెక్షన్ 8 కు తాను వ్యతిరేకమని అలాగే హైదరబాద్ లో తెలంగాణ సీఎం ప్రజల భద్రతను కాపాడాల్సిన బాధ్యత తీసుకుంటే సెక్షన్ 8 తో పనే లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రోళ్లు అనే మాట పదే పదే ప్రస్తావించ వద్దని ముఖ్యంగా హరీష్ రావు ఈ మాట అంటూ ఉంటాడని పవన్ అన్నారు. ఆంధ్రోళ్లు అంటే అదో కులం కాదని ఇక్కడ మాల, మాదిగ,ముస్లిం,క్రిస్టియన్, ఇతర కులాల సమ్మేళనం అని కాపులు ఒక్కరే కాదని అన్నారు. 


ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్


దీనిపై  తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు, పవన్ అసలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని టీడీపీ నేత రేడ్ హ్యాండ్ గా దొరికిన విషయం తెలిసిందే.. దీనిపై మాట్లాడేం.. పవన్ కల్యాణ్ తన స్థాయిని గుర్తించి మాట్లాడాలని సూచించారు. ఓటుకు నోటు కేసులో ఖమ్మం ఎమ్మెల్యే సండ్ర వీరయ్యను ఉద్దేశపూర్వకంగానే ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించడం సరైంది కాదని అన్నారు.  ఓ వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ను అభినందిస్తూనే మరోవైపు విమర్శించడం భావ్యం కాదన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: