భారత దేశం గర్వించ దగ్గ మహోన్నతమైన వ్యక్తి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం(84) ఆకస్మిక మృతి చెందారు. ఈయన మృతి పట్ల దేశం కన్నీటి పర్యంతం అయ్యింది.  రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతి  దేశానికి తీరని లోటని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి అబ్దుల్ కలాం అనితర సేవలు అందించారని తెలిపారు. ఒక శాస్త్రీవేత్తగా దేశాన్ని ప్రగతి పదంలో నడిపించారు,  ఇటు పరిపాలకుడిగా కలాం దేశానికి మహోన్నతమైన సేవలు అందించారని కొనియాడారు.

ఆయన ప్రజల గుండెల్లో ఎప్పుడూ  రాష్ట్రపతిగానే నిలిచిపోతారని ప్రణబ్ తన గౌరవ సంతాపంలో పేర్కొన్నారు. భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంతాపం ప్రకటించారు.  హైదరాబాదులో కలాం అనేక పరిశోధనలు చేశారని ఆయన అన్నారు. ఆయన మరణవార్త వినగానే ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  కలాం చేసిన సేవలు భారతదేశ విజ్ఢానాన్ని ద్విగుణీకృతం చేస్తాయని ఆయన అన్నారు.


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

'ప్రజల రాష్ట్రపతి.. అబ్దుల్ కలాం'

అబ్దుల్ కలామ్ మృతికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సంతాపం ప్రకటించారు. ఆయన మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్య్కంత చేశారు. కలాం మృతి దేశానికి తీరని లోటు అని చంద్రబాబు నాయుడు అన్నారు. దేశం గొప్ప శాస్త్రవేత్తను, దార్శనికుడిని, స్ఫూర్తిదాతను కోల్పోయిందని ఆయన అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: