టీడీపీ నేతలకు సాక్షి అంటే పడదు.. కాంగ్రెస్ నేతలకు ఈనాడు అంటే పడదు.. టీఆర్ఎస్ నేతలకు ఆంధ్రజ్యోతి అంటే పడదు.. ఇలా ఉంది తెలుగు నేలలో పార్టీలు- పత్రికల  మధ్య రాజకీయం.. దీనికి తగ్గట్టుగానే ఆయా పత్రికలు మీడియా వ్యవహరిస్తున్నాయి. తమకు అనుకూలమైన నాయకులు ఏం చేసినా గప్ చుప్.. గిట్టని వారు చేస్తే మాత్రం  నానా యాగీ చేసేస్తాం.. అన్నట్టుగా తయారైంది పరిస్థితి. 

గతంలో ఒక పత్రికపై విమర్శలు చేయాలంటే నాయకులు జంకేవారు.. ఇప్పుడు వ్యవహారం పబ్లిక్ సీక్రెట్ కావడంతో నాయకులు కూడా డైరెక్టుగానే కామెంట్లు చేసేస్తున్నారు. ఆ మధ్య సీఎం రమేశ్ కూడా సాక్షి విలేకరిపై చిందులు తొక్కేశారు. తనపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని.. అవి రుజువు చేస్తే రాజీనామా చేస్తానని.. లేకపోతే సాక్షి పత్రిక మూసేస్తారా అంటూ తోటి మీడియా మిత్రుల ముందే సాక్షి విలేఖరిపై విరుచుకుపడ్డారు.

టీడీపీ వర్సెస్ సాక్షి.. రొటీనైపోయింది..

Image result for kalva srinivasulu
లేటెస్టుగా ఆంధ్రా ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు కూడా సాక్షి పత్రికపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఇటీవల ఆయన ఇసుక దందా చేస్తున్నట్టు సాక్షి పత్రిక రాసిందట. ఆ ఆరోపణలు పూర్తి అవాస్తవమని.. దమ్ముంటే వాటిని రుజువు చేయాలని ఆయన సవాల్ విసిరారు. అసలు దందా వైసీపీ నేతలదే అని ఎదురుదాడి చేశారు. 

సాక్షి తీరును తప్పుబడుతూ కాల్వ ఒక బహిరంగ లేఖ రాశారు. ఇసుక దందాలో పట్టుబడింది కర్నాటకు చెందివనారని తెలుస్తోందని వారు రామచంద్రారెడ్డికి సన్నిహితులు కావచ్చని ఆయన సందేహం వ్యక్తం చేశారు. తనపై చేసిన ఆరోపణలకు సాక్షి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తనపై ఆరోపణలు రుజువు చేస్తే ప్రజా జీవితం నుంచి తప్పుకుంటానని లేని పక్షంలో సాక్షిని మూసివేసి బహిరంగ క్షమాపణ చెబుతారా అని  ఆయన సవాల్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: