అతిసాధార‌ణ స్థాయి నుంచి దేశ ప్ర‌థ‌మ పౌరుడి స్థాయికి ఎదిగిన అవుల్ ఫ‌కీర్ జైనుల‌బ్ధీన్(ఏపీజే) అబ్దుల్ క‌లాం చిన్న నాటి అతిదుర్భ‌ర జీవితాన్ని అనుభ‌వించారు. చిన్న‌త‌నంలోనే ఓ పేప‌ర్ బాయ్ గా ప‌నిచేసి వ‌చ్చిన డ‌బ్బుల‌తో చ‌దువును కొన‌సాగించారు. క‌లాం త‌మిళ‌నాడు రామేశ్వ‌రంలో 1931 ఆక్టొబ‌ర్ 15 ఓ నిరుపేద కుటుంబంలో జ‌న్మించారు. రామేశ్వ‌రం పేప‌ర్ బాయ్ నుంచి రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ వ‌ర‌కు సాగిన క‌లాం ప్ర‌స్థానం లో ఆయ‌న దేశానికి అందించిన సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివి. క‌లాం తండ్రి జైనుల‌బ్దీన్ చిన్న ప‌డ‌వ‌కు యజ‌మాని. త‌ల్లి అశియ‌మ్మ గృహిణి. చాలి చాల‌ని జీతం తో త‌న తండ్రి కుటుంబాన్ని పోషిస్తే క‌లాం మాత్రం త‌న చిన్న‌త‌నం లోనే ప‌నిచేస్తూ చ‌ద‌వాల్సి వ‌చ్చింది. చిన్న నాటి నుంచి కొత్తగా ఆలోచించాల‌ని భావించిన క‌లాం ప్ర‌పంచం గ‌ర్వించద‌గ్గ శాస్త్ర‌వేత్త గా ఎదిగారు. అర‌వయ్యో ద‌శ‌కంలో డీఆర్ డీఓ లో శాస్త్ర‌వేత్త‌గా ఆయ‌న దేశానికి అనేక విజ‌యాలు అందించారు. అక‌స్మాత్తుగా నిన్న (జూలై 27) రోజు సాయంత్రం 7:30 గంట‌ల‌కు మేఘాల‌య రాజ‌దాని షిలాంగ్ లోని ఐఐఎం లో విద్యార్దుల‌కు భ‌విష్య‌త్తు నిర్దేశం చేస్తూ ఆయ‌న తుది శ్వాస విడిచారు. 


11 రాష్ట్ర‌ప‌తి ఏపీజే అబ్దుల్ క‌లాం అక‌స్మిక మ‌ర‌ణం  

అబ్దుల్ కలాం చిన్న నాటి ఓ కొత్త త‌రంగా అలోచ‌న‌లో ఉన్న ఆయ‌న చ‌దువులో అదే స్థితిని కొన‌సాగించారు. మ‌ద్రాస్ యూనివ‌ర్శీటి లో భౌతిక శాస్త్రం పూర్తి చేశారు. మ‌ద్రాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఏరో స్పేస్ ఇంజ‌నీరింగ్ చ‌దివారు. భార‌తీయ క్షిప‌ణి వ్య‌వ‌స్థ‌కు ఊపిరూలూది 'మిస్సైల్ మ్యాన్' గా పేరుగాంచారు. క్షిఫణి రంగంలో భార‌త ఖ్యాతిని ఇనుమ‌డింప‌జేసిన ఆగ్ని, పృద్వీ తదిత‌ర క్షిప‌ణులు ఆయ‌న మార్గనిర్ధ‌శ‌క‌త్వంలో రూపొందిన‌వే. 1998 లో పోఖ్రాన్ అణు ప‌రీక్ష‌ల వెన‌క కీల‌క శ‌క్తి క‌లాం నిర్వ‌ర్తించారు. 11 రాష్ట్ర‌ప‌తి ఏపీజే అబ్దుల్ క‌లాం అక‌స్మిక మ‌ర‌ణంతో భార‌త శాస్త్ర , సాంకేతిక రంగం మార్గ‌ద‌ర్శ‌కున్ని, పెద్ద‌దిక్కును కోల్పోయింది. క‌లాం శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ది అంతా ప్ర‌జ‌ల కోస‌మేన‌ని చాటి చెప్పారు. సైన్సు ను ప్ర‌జ‌ల కోసం వినియోగించ‌డంలో అగ్ర‌భాగాన నిలిచారు. భార‌త దేశం అగ్ర‌భాగాన నిల‌పాల‌ని ఎంతో అకాక్షించారు క‌లాం. భార‌త అణ్వ‌స్థ్ర పితామ‌హుడిగా, క్షిఫ‌ణి రంగ రూప‌శిల్పిగా దేశానికి సేవ‌లందించి భారత కీర్తి ప‌తాక ను విశ్వ విను వీదిలో స‌మున్న‌తంగా నిలిపారు.

 

భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ ఇస్రోలో వివిధ హోదాల్లో బాద్య‌త‌లు నిర్వ‌హించిన క‌లాం పీఎస్ఎల్ వీ, ఎస్ఎల్ వీ ప్రాజెక్టుల అభివృద్ది లో కీల పాత్రం పోషించారు. క‌ల‌లు క‌నండి వాటిని సాకారం కోసం క‌ష్ట‌ప‌డండి అన్ని ఆయ‌న మాట‌లు కోట్లాగి మంది యువ‌త‌కు ఆద‌ర్శం .దేశంలో ఆయ‌న స్పూర్తి తోనే అనేక మంది అంత‌రిక్ష శాస్త్ర‌వేత్త‌లు వ‌చ్చారంటే అతిశ‌యోక్తి కాదు. ఆధునిక టెక్నాల‌జీ తో అమెరికా, ర‌ష్యా లాంటి దేశాల అందుకొనంత ముందుకు దూసుకు పోతున్న స‌మ‌యంలో అంత‌రిక్ష నౌక‌ల‌కు రూప‌క‌ల్ప‌న చేసి విజ‌య‌వంతంగా ప్ర‌యోగించారు. పృథ్వీ , అగ్ని, నాగ్ త్రిశూల్ త‌దిత‌ర క్షిప‌ణులు క‌లాం కృషితో భారత అమ్ముల పొద‌లోకి చేరాయి. క‌లాం అగ్ని బాలిస్టిక్ క్షిప‌ణి ద్వారా భార‌త శ‌క్తి సామ‌ర్ధ్యాల‌ను ప్ర‌పంచానికి చాటారు. పూర్తి స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో ఈ క్షిప‌ణులు రూప‌క‌ల్ప‌న చేయ‌డం విశేషం. 19987 ఫోఖ్రాన్-2 అణు పరీక్ష లో కీల‌క‌మైన సంస్థాగ‌త, సాంకేతిక పాత్రి పోషించారు. శాస్త్ర సాంకేతిక రంగాలు ప్ర‌జల జీవ‌నం లో స‌మూల మార్పుకు జీవ‌న ప్ర‌మాణాలు వృద్ది చేందేందుకు కృషి చేయాల‌ని చెప్ప‌డమే కాదు, ఆచ‌ర‌ణ లో నిజం చేశాడు.

 

న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్న సాంకేతిక‌త‌ను గ్రామీణ ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తేవాల‌ని అప్పుడే నిజ‌మైన అభివృద్ది మార్పు సంభ‌విస్తుంద‌ని చెప్పి 'ప్రొవిస‌న్ ఆఫ్ అర్బ‌న్ ఎమినిటీస్ టుం రూర‌ల్ ఏరియాస్(పురా)' కు రూప‌క‌ల్ప‌న  చేశారు. అంతేకాకుండా అట‌ల్ బీహ‌రీ వాజ్ పేయి ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న ప్ర‌ధాన శాస్త్రీయ స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రించారు. శాస్త్ర‌వేత్త‌గా అబ్దుల్ క‌లాం చేసిన సేవ‌ల‌ను గ‌ర్తించిన భార‌త ప్ర‌భుత్వం 1997 లో  ఆయ‌న దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారం 'భార‌త ర‌త్న' తో స‌త్క‌రించింది. వామ ప‌క్షాలు బ‌ల‌పరిచిన అభ్య‌ర్ధి  ల‌క్ష్మి సెహ‌గ‌ల్ పై భారీ మెజారీటి తో గెలిచి 2002 నుంచి 2007 వ‌రకు దేశ 11 వ రాష్ట్ర‌ప‌తి గా క‌లాం ప్ర‌ఖ్యాతి గాంచారు. క‌లాం గొప్ప‌త‌నాన్ని చూసి ఆయ‌ను ప్ర‌పంచంలోని 40 యూనివ‌ర్శిటిలు ఆయ‌న‌కు గౌర‌వ డాక్ట‌రేట్ల తో స‌త్క‌రించారు.

 

దాని క‌నుగుణంగానే ఆయ‌న సంక్లిష్ట స‌మ‌యంలో రాష్ట్ర‌పతి ప‌ద‌వి చేప‌ట్టి భార‌ద ప్ర‌థ‌మ పౌరుని క‌ర్త‌వ్యాల‌ను  నెర‌వేర్చారు. అత్యున్న‌త స్థానం లో ఉన్నా పిల్ల‌ల‌కు ద‌గ్గ‌రైన వ్య‌క్తుల్లో నెహ్రూ త‌రువాత స్థానాన్ని క‌లాం ద‌క్కించుకున్నారు. రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి నుంచి వైదొల‌గిన అనంత‌రం క‌లాం త‌న కిష్ట‌మైన భోద‌న రంగంలో కొన‌సాగారు. ఐఐఎం షిల్లాంగ్ ఆహ్మ‌దాబాద్, ఇండోర్ ల‌కు వీజీటింగ్ ప్రోపెస‌ర్ గా సేవ‌లందించారు. అలాగే త‌న కిష్ట‌మైన మ‌రో ప్ర‌వృత్తి ర‌చనా వ్యాసాంగం. ఎంద‌రో ప్ర‌ముఖుల మ‌న్న‌న‌లు పొందిన  'వింగ్స్ ఆఫ్ ఫైర్' గా వెలువ‌రించారు.ఇందులో క‌లాం త‌న ఆత్మ‌క‌థను పొందుప‌రిచారు.  ఇంగ్లీష్ లో ముద్రించిన ఈ పుస్త‌కాన్ని త‌రువాత 13 భాష‌ల్లో అనువ‌దించారు. బ్రెయిలీ లిపి లో కూడా ఈ పుస్త‌కం ముద్రిత‌మువ‌డం విశేషం. క‌లాం జీవితంలో హైద‌రాబాద్ ఎంతో అనుబంధం ఉంది. ఆయ‌న హైద‌రాబాద్ లోని డీఆర్డీఓ లో ప‌నిచేశారు.హైద‌రాబాద్ ఐఐఐటీ ని బోధించారు. 


ఆయ‌న క‌ల‌ల లోంచి ఉద్బ‌వించిని 'క‌లాం-రాజు స్టెంట్' ఎంద‌రినో హృద్రోగం నుంచి కాపాడుతోoది.


ప్ర‌ఖ్యాత కార్డియాల‌జిస్ట్ డాక్ట‌ర్ సోమారాజు తో క‌లిసి త‌న ఆలోచ‌న‌ల‌ను పంచుకున్నారు. వీరివురి కృషి, ఆలోచ‌న నుంచే గుండె సంబంద రోగాల నుంచి కాపాడే స్టెంట్ త‌యారీ కి అంకురార్ప‌ణ జ‌రిగింది. క‌లాం రూపొందించిన 'క‌లాం-రాజు' ఇవ్వాళ వేలాది మందికి శ్వాస‌ను  నిలుపుతున్నది.  క్షిప‌ణి శాస్త్ర విజ్ఞానాన్ని వైద్య‌శాస్త్రం తో జోడించి ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించాల‌న్న ఆయ‌న క‌ల‌ల లోంచి ఉద్బ‌వించిని 'క‌లాం-రాజు స్టెంట్' ఎంద‌రినో హృద్రోగం నుంచి కాపాడితే అదే గుండెపోటుతో క‌లాం తుదిశ్వాస విడ‌వ‌టం విషాదం. 

 


మరింత సమాచారం తెలుసుకోండి: