టీవీ చాలా శక్తివంతమైన మీడియా.. పత్రికలు కేవలం చదువు వచ్చిన వారినే, అవి కొని చదివేవారినే ప్రభావితం చేస్తే.. టీవీలు మాత్రం పండితులు, పామరులు అనే తేడాలేకుండా అందరి మెదళ్లలోనూ చొచ్చుకుపోతాయి. పత్రికలకు ఒక టైమ్ బౌండ్ వరకూ మాత్రమే పరిమితం అయితే.. టీవీలు మాత్రం నిరంతరం ప్రత్యక్షప్రసారాలు చేస్తూ.. ఎప్పటికప్పుడు వార్తలు అందించగలుగుతున్నాయి. 

ఐతే.. మీడియా స్వేచ్ఛ అనే ముసుగులో టీవీలు కొన్ని అభ్యంతరమైన కార్యక్రమాలు ప్రసారం చేస్తూ ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నాయన్న అపవాదు మూటగట్టుకుంటున్నాయి. అశ్లీలత, అసభ్యత విషయంలో వీటిపై చాలా కంప్లయింట్లు ఉన్నాయి. ఇప్పుడు వాటిని మించిన నష్టం కలిగించే కార్యక్రమాల విషయంలోనూ కనీస నిబంధనలు పాటించడం లేదు. 

ఉగ్రదాడుల లైవ్ ఏమాత్రం మంచిది కాదు.. 


ఉగ్రవాద దాడుల సమయంలో మీడియా వైఖరి విమర్శల పాలవుతోంది. గతంలో ముంబై దాడుల సమయంలోనూ అంతే జరిగింది. ఉగ్రవాదుల దాడులు-వాటిని పోలీసులు ఎదుర్కొంటున్న తీరును ఛానళ్లు లైవ్ ప్రసారాలు చేశాయి. దీంతో ఉగ్రవాదులకు పోలీసుల కదలికల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందేది. ఆ ఘటన తర్వాత మీడియా ఉగ్రవాదుల దాడులను ప్రత్యేక్ష ప్రసారం చేయరాదన్న నిబంధనలు వచ్చాయి. 

సోమవారం పంజాబ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడి విషయంలోనూ కొన్ని ఛానళ్లు పాత పద్దతిలోనే వ్యవహరించి విమర్శల పాలయ్యాయి. టీవీల్లో లైవ్ లు ఇవ్వడం వల్ల ఉగ్రవాదులు చూసి పాకిస్థాన్ నుంచి ఇక్కడికి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని భావించిన ప్రసార మంత్రిత్వశాఖ ద్వారా.. లైవ్ లు నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్పందించిన ఆజ్ తక్, ఇండియా టుడే సీఈఓ రాజ్ దీప్ సర్దేశాయి మా నెట్ వర్క్ లో అసలు లైవ్ లు ఇవ్వలేదని, మిగతా వాళ్ల కూడా అలా ఉంటే మంచిదని ఓ సలహా ఇచ్చారు. దేశ రక్షణకు సంబంధించిన ఇలాంటి విషయాల్లోనూ మీడియా అతి చేయడం ఏమాత్రం మంచిది కాదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: