ఈ మద్య కాలంలో వ్యభిచారం మొత్తం హైటెక్ రంగు పులుముకుంటుంది. నగరాలు ఎంతగా విస్తరిస్తున్నాయో.. అశ్లీలత కూడా అదేరేంజ్ లో విజృంభిస్తుంది. కొంత మంది బడా బాబులు యువత వీక్ నెస్ తో ఆడుకుంటున్నారు.  పెద్ద పెద్ద నగరాల్లో మత్తు మందు, జూదాలు, హైటెక్ వ్యభిచారాలు కామన్ అయిపోయాయి.  కొంతమంది యువతులకు డబ్బు ఎర చూపి వారిని వ్యభిచార రొంపలోకి దింపి బెదిరింపులకు పాల్పపడుతున్నారు. 

పేదరికంలో మగ్గుతున్న గ్రామీణ యువతులకు రంగుల ప్రపంచం చూపించి వారితో వ్యభిచారం చేయిస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు కొంతమంది పెద్దలు. తమ గుట్టు రట్టు కాగానే అమాయకులైన వారిని పోలీసులకు అప్పగించేస్తున్నారు. ఇందులో విదేశాల నుంచి వచ్చిన యువతులు, ముంబాయి, కలకత్తా పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన యువతులు చాలా మంది బలైతున్నారు. తాజాగా బ్యూటీ పార్లర్ నడుపుతున్నట్టు కలరింగ్ ఇచ్చి అందులో వ్యభిచారాన్ని రన్ చేస్తున్న ముటా ను పట్టుకున్నారు పోలీసులు.

బ్యూటీ పార్లర్ ముసుగులో వ్యభిచారం


వైజాగ్ త్రీ టౌన్ లో చాప్ సెలూన్స్ అండ్  బ్యూటీ పార్లర్  పేరుతో నడుపుతున్న సెంటర్ లో ఈ తతంగం అంటా జరుగుతుంది. చాప్స్‌ సెలూన్‌ అండ్‌ బ్యూటీ పార్లర్‌లో వ్యభిచారం జరుగుతోందనే సమాచారంతో దాడిచేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముగ్గురు యువతులు, విటుడు, నిర్వాహకుడిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ. 1.25లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: