హైదరాబాద్ లోని  చైతన్యపురిలో జరిగిన అక్కాచెల్లెళ్ల జంట హత్యల కేసులో నిందితుడు అమిత్ సింగ్‌ను నగర ఎస్‌వోటీ పోలీసులు మంగళవారం నాడు ఉదయం అరెస్టు చేశారు.తాను ప్రేమించిన యువతి శ్రీలేఖను కలిసేందుకు నిందితుడు అమిత్ సింగ్ వారం రోజుల పాటు ప్రయత్నించాడని, ఆమెను కలవడానికి అవకాశం చిక్కకపోవడంతో సైకోగా మారి అక్కాచెల్లెళ్లను హత్య చేశాడని భావిస్తున్నారు. ప్రేమోన్మాది అమిత్ సింగ్ గుజరాత్ రాష్ట్రంలో తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ నెల 14వ తేదీన అక్కాచెల్లెళ్ల పైన అమిత్ సింగ్ కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే.యువతుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఈ కేసును చాలెంజ్ గా తీసుకున్నారు. హత్య చేసిన అమిత్ సింగ్ పారిపోయిన వెంటనే పోలీసులు అమిత్ సింగ్ చదివాడని చెబుతున్న నారాయణగూడా, ఇబ్రహీంపట్నం కాలేజీలకు వెళ్లి స్నేహితుల వద్ద ఆరా తీశారు. అయితే, అతను ఆ కాలేజీల్లో చదవడం లేదని పోలీసులు తేల్చుకున్నారు. ఆ తర్వాత స్వస్థలం షాద్ నగర్ వెళ్లారు. అమిత్ సింగ్ కుటుంబ సభ్యుల ఇంటికి తాళం వేసి ఉంది. కుటుంబ సభ్యులను పట్టుకోవడంలో పోలీసులు మునిగిపోయిన సమయంలో అమిత్ సింగ్ జులై 14వ తేదీన నేరుగా సికింద్రాబాద్ వెళ్లి ఢిల్లీకి వెళ్లే రైలు ఎక్కినట్లు గుర్తించారని సమాచారం.

ప్రేమోన్మాది చేతిలో బలైపోయిన అక్కచెల్లెలు యామిని, శ్రీలేఖ


సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆచూకీ గుర్తించిన పోలీసులు మంగళవారం అతనిని గుజరాత్ లో అదుపులోకి తీసుకున్నారు. అమిత్‌సింగ్‌ను అదుపులోకి తీసుకునేందుకు 4 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే.  మొదట ఎల్‌బీనగర్ నుంచి ఉప్పల్ వెళ్లే మార్గంలో మూసీ నది వద్ద చివరగా ఫోన్ కాల్ మాట్లాడి స్విచ్ఛాఫ్ చేసినట్లు గుర్తించిన పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లోనూ గాలించారు. పోలీసులు  4 బృందాలుగా విడిపోయిన పోలీసులు సెల్‌ఫోన్ ఆధారంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆఖరికి సిగ్నల్స్ ఆధారంగా గుజరాత్‌లో అమిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: