వాన‌లు మొద‌ల‌య్యాక నీటి స‌ర‌ఫ‌రాలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఒక్కోచోట తాగునీటి గొట్టాలు ప‌గిలిన‌ప్పుడు క‌లుషిత నీరు అందులో ప్రవేశిస్తుంది. లేదా బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు అక్కడ సుర‌క్షితం కాని నీటిని ఒక్కో సారి తీసుకోవాల్సి వ‌స్తుంది. సామూహిక ప్రదేశాల్లో తాగు నీటి స‌ర‌ఫ‌రా సుర‌క్షితంగా ఉండ‌క పోవ‌చ్చు. ఇటువంటి సంద‌ర్భాల్లో తాగునీరు క‌లుషితం కావ‌చ్చు. అంటే తీసుకొనే నీటిలో కాలుష్య కార‌క సూక్ష్మ జీవులు, బ్యాక్టీరియాలు ఉండ‌వ‌చ్చు. వీటితో ప్రమాద‌క‌ర‌మైన డ‌యేరియా తో పాటు కామెర్లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా హెప‌టైటిస్ ఏ, హెప‌టైటిస్ ఈ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌.

ఈ రెండు ర‌కాల క్రిములతో జీర్ణ వ్యవ‌స్థ లోని కాలేయంలో క‌ణ‌జాలం పాడవుతుంది. ఫ‌లితంగా కామెర్లు సోక‌వ‌చ్చు. అందుచేత ఈ సీజ‌న్ లో సుర‌క్షిత‌మైన తాగునీటిని తీసుకోవాలి.  శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అలా జరకుండా శరీరంను ఎప్పుడూ తేమగా ఉంచుకోవడానికి, ఇన్ఫెక్షన్స్ బారి నుంచి తప్పించుకోవాలంటే నీరు ఎక్కువగా తాగాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అది కూడా నీటిని బాగా మరిగించి, వడపోసి తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.


వర్షాకాలంలో ఆవిరి మీద ఉడికించిన ఆహారాలు అంట్లే ఇడ్లీ వంటివి ఆరోగ్యానికి ఉత్తమం. వర్షాకాలంలో ఆయిల్ లేదా ఫ్రైడ్ ఫుడ్స్‌ను తినడం నివారించాలి. గ్రిల్డ్ చేసిన ఆహారాలను మితంగా తీసుకోవడం మంచిది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉత్తమం. వేసవి కాలంలోనే కాదు, ఫ్రెష్ జ్యూసులకు వర్షాకాలంలో కూడా మంచిదే. శరీరానికి తగిన హైడ్రేషన్ అందివ్వడానికి తాజా పండ్లు, కూరగాయలతో తయారుచేసిన జ్యూసులను తీసుకోవడం మంచిది.


ముఖ్యంగా పండ్లలో వ్యాధినిరోధకతను పెంచేవాటిని ఎక్కువగా ఎంచుకోవాలి. వర్షాకాలంలో వ్యాధినిరోథకను పెంచే విటమిన్ సి ఫుడ్స్‌ను ఎక్కువగా తీసుకోవాలి. అలాంటి వాటిలో దానిమ్మ, కివి, ఆరెంజ్‌లు ఉత్తమం. జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లైతే నీటి శాతం అధికంగా ఉండే ఫ్రూట్స్‌ను తినకుండా ఉండటమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  కొంత‌మంది ఈ సీజ‌న్ లో పానీ పూరి వంటివి ఎక్కువ తీసుకొంటారు. అటువంటి చోట దొరికే నీరు ఎటువంటిదో తేలిగ్గా తెలిసిపోతుంది. బ‌య‌ట హోట‌ల్స్ లో కూడా స‌రైన నీరు ఇస్తున్నారో , లేదో అక్కడ ప‌రిస్థితుల్ని గ‌మ‌నిస్తే అర్థం అయిపోతుంది.  క్రమం త‌ప్పకుండా క‌లుషిత నీరు తీసుకోంటే ఇబ్బంది ఉంటుంద‌ని గుర్తుంచుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: