పదవులు చేపట్టి ఏడాది దాటినా ఇంకా తమ శాఖలపై మంత్రులు పట్టు సాధించలేకపోవడంపై ఏపీ సీఎం ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన వివిధ మార్గాల ద్వారా మంత్రుల పనితీరుపై రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. వాటి ప్రకారం సంతృప్తికరంగా పని చేస్తున్న మంత్రుల సంఖ్య వేళ్లపైనే లెక్కపట్టాల్సిరావడం విశేషం. 

తానొక్కడినే కష్టపడితే సరిపోదని.. తన టీమ్ కూడా అందుకు తగినట్టుగా శ్రమపడితేనే ఫలితాలు వస్తాయని భావిస్తున్న చంద్రబాబు త్వరలోనే కొందరికి క్యాబినెట్ నుంచి తప్పించవచ్చని తెలుస్తోంది. అలాగే పార్టీలో సీనియర్స్ అయి ఉండి.. గత ఎన్నికల్లో గెలవకపోవడంతో మంత్రి పదవులు దక్కని కొందరు ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైనందువల్ల వారిని కేబినెట్లోకి తీసుకోవచ్చని తెలుస్తోంది. 

క్యాబినెట్ ప్రక్షాళన దిశగా.. 

Image result for chandrababu cabinet meeting
చంద్రబాబు మనసు గెలుచుకోవడంలో విఫలమైన వారిలో ఏకంగా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప కూడా ఉండటం విశేషం. వీరితో పాటు.. పీతల సుజాత, కొల్లురవీంద్ర, పల్లె రఘునాథరెడ్డి, గంటాశ్రీనివాసరావు, చినరాజప్ప, పత్తిపాటి పుల్లారావు, మృణాళిని, సునీతల తీరుపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారట. కేఈ కృష్ణమూర్తి.. ఊరికే చంద్రబాబుపై పరోక్షంగా విమర్శలు చేయడం ఆయనకు కోపం తెప్పిస్తోంది. 

మరో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప.. తన పదవికి తగినంత దూకుడుగా ఉండకపోవడం మైనస్ పాయింట్ అయ్యింది. అలాగే కొందరు మంత్రులు బంధువుల జోక్యం విపరీతంగా పెరిగిపోతోందని బాబు దృష్టికి వచ్చింది. తండ్రులు, మామలు, చివరకు భార్యలు కూడా పెత్తనం చేసే స్థాయిలో ఉన్నారని.. ఇది మంచిది కాదని బాబు భావిస్తున్నారు. వీరి స్థానంలో పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర వంటి వారికి బెర్తులు దక్కే అవకాశం ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: