దేశ వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌కు దారి తీస్తున్న‌యాకుబ్ మెమెన్ ఉరితీత పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ కు దారి తీస్తుంది. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఉరితీయాడానికి స‌ర్వం సిద్దం చేస్తుంటే, మ‌రోవైపు కొంత మంది యాకుబ్ మెమెన్ ఉరితీత‌ను వ్య‌తిరేకిస్తున్న వస్తున్నారు. వీరంతా దేశ భ‌క్తులు గానో, వ్య‌తిరేకిస్తున్న వారంతా టెర్ర‌రిస్టుల స‌మ‌ర్ధ‌కులుగానో చూడాల్సిన ప‌నిలేదు. అత్యంత అరుదైన కేసుల్లో అరుదైన తీర్పుగా ఉరిశిక్ష విధింప‌బ‌డాల‌ని భార‌త శిక్షాస్మృతి చెబుతోంది. ఉరిశిక్ష క‌న్నా త‌క్కువ శిక్షకు అర్హ‌త గా ఏ కొంత అవ‌కాశం ఉనా దాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌న్న‌ది మ‌న న్యాయ‌సూత్రాల చెబుతున్నాయి. ముంబై వ‌రుస పేలుళ్ల నిందితుడు యాకుబ్ అబ్దుల్ ర‌జాక్ మెమెన్ ఉరితీత విష‌యంలో సందిగ్ధ‌త కొన‌సాగుతూనే ఉంది. క్ష‌మాభిక్ష పై సుప్రీం కోర్టు ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం ఏకాభిప్రాయానికి రాలేదు. దీంతో క్షిమాభిక్ష పిటిష‌న్ ను విస్తృత ధ‌ర్మాస‌నానికి పంపించారు.


దీని పై నిర్ణ‌యం ఎలా ఉండ‌బోతుంద‌నేది ఎలా ఉన్నా..ఒక వైపు  ఈ రేపు(3 0వ తేదిన‌) ఉరితీత‌కు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం స‌న్నాహాలు చేస్తుంటే.., మ‌రోవైపు ఉరి శిక్ష‌ను నిలిపివేయాల‌నే ఆందోళ‌న‌లు ఊపందుకుంటున్నాయి. న్యాయ కోవిదులు మొద‌లు ప్ర‌జాస్వామిక‌వాదులు, వివిధ పార్టీల నేత‌లు, బాలీవుడ్ తారల వ‌ర‌కు యాకుబ్ మెమెన్ ఉరితీత అన్యాయ‌మంటూ రాష్ట్ర‌ప‌తి కి విన్న విస్తున్నారు. దీంతో యాకుబ్ మెమెన్ ఉరిశిక్ష అంశం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం గా మారింది. ముంబాయి లో 1993లో  మిట్ట మ‌ధ్యాహ్నాం రెండు గంట‌ల వ్య‌వ‌ధిలో ప‌న్నెండు చోట్లు జ‌రిగి  సుమారు 257 మంది మృతి చెంద‌గా, మ‌రో 1400 మంది క్ష‌తగాత్రుల‌య్యారు. దేశ ఆర్ధిక రాజ‌ధాని పై జ‌రిగిన ఈ టెర్ర‌రిస్టు దాడిని దేశ‌మే కాదు, ప్ర‌పంచమంతా తీవ్రంగా వ్య‌తిరేకించింది.మాన‌వ‌త్వం పై జ‌రిగిన దాడిగా అభివ‌ర్ణించింది. ఐఎస్ఐ అండ‌తో న‌ర‌మేధం సృష్టించిన టెర్ర‌రిస్టుల‌ను , వారికి సాయ‌మందించిన వారిని భార‌త నిఘా వ‌ర్గాలు అన‌తి కాలంలోనే గుర్తించి నిర్భందించాయి.


1993 ముంబై వ‌రుస పేలుళ్ల 


దీనిపై ముంబై టాడా కోర్టు ప‌ద‌కొండు మంది నిందితుల‌పై విచార‌ణ పూర్తి జ‌రిపి 2007 లో ఉరిశిక్ష విధించింది. దీనిపై నిందితులంతా సుప్రీ కోర్టు ను ఆశ్ర‌యించారు. విచార‌ణ జ‌రిపిన అత్యున్న‌త న్యాయ‌స్థానం 2015 లో వీరిలో 10 మందికి ఇప్ప‌టికే ఇర‌వై ఏళ్లు జైలు జీవితం గ‌డిపినందున వారికి ఉరిశిక్ష ను ర‌ద్దు చేసి యావ‌జ్జీవ శిక్ష గా మార్చింది. మెమెన్ మాత్రం ఉరిశిక్ష ను ఖ‌రారు చేసింది.  ఈ క్రమంలో క్షమాభిక్ష కోసం యాకుబ్ మెమెన్ పెట్టుకున్న పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడంతో ఆయనకు ఉరిశిక్ష ఖాయమైంది. ఈ నెల 30న మెమెన్‌ను ఉరితీయడానికి నాగపూర్ జైల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప‌రిస్థితుల్లోనే మెమెన్ ఉరితీత‌ను వ్య‌తిరేకిస్తున్న వాళ్లంతా ఆయ‌న పూర్వ‌రంగాన్ని ఉటంకిస్తూ అత‌ని ఉరిశిక్ష ను రద్దు చేసి, క్ష‌మాభిక్ష ప్రసాందించాలని  కోరుతున్నారు. టెర్ర‌రిస్టు దాడి తో ప్ర‌త‌క్ష్య ప్ర‌మేయంలేని మెమెన్ కు ఉరిశిక్ష విధించడం స‌రికాదంటున్నారు. 


యాకుబ్ మెమెన్ త‌నంత‌ట తాను గా లొంగిపోయి ముంబై పేలుళ్ల కేసు విచార‌ణ‌కు పూర్తిగా స‌హ‌క‌రించాడ‌ని చెప్పుకొస్తున్నారు. త‌న సోద‌రుడు టైగర్ మెమెన్ భార‌త్ లొంగిపోవ‌ద్ద‌ని వారిస్తున్నా, అతన్ని టెర్ర‌రిస్టుగానే చూస్తారు త‌ప్ప, మరోలా కాద‌ని హెచ్చ‌రించినా విన‌కుండా భార‌త్ కు లొంగిపోయాడంటున్నారు.ఈ నేప‌థ్యంలోనే నేపాల్ రాజ‌ధాని ఖాట్మండ్ లో మెమెన్ అరెస్ట్, భార‌త్ కు త‌ర‌లించడంలో కీల‌క భూమిక పోషించిన భారత విదేశీ నిఘా విభాగం (రా) మాజీ అధికా రి బి.రామన్ వ్యాసాన్ని ఉదహరిస్తున్నారు. ముంబై దాడికి సూత్ర, పాత్రధారులుగా నిర్ధారించి నిందితులందరికి టాడా కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. ఆ తర్వాత రామన్ ఈ వ్యాసాన్ని రాశారు. రామన్ 2007లో రాసిన తన వ్యాసంలో ఈ కేసులో ముంబై పోలీసులు, సీబీఐ, ఐబీ గొప్ప పనితీరు చూపాయి. కానీ, మెమన్ శిక్ష తగ్గింపునకు అవకాశమున్న కీలకాంశాలను ప్రాసిక్యూషన్ కోర్టు దృష్టి కి తీసుకువెళ్లలేదు. 


భారత విదేశీ నిఘా విభాగం (రా) మాజీ అధికా రి బి.రామన్


మెమన్‌కు ఉరిశిక్ష విధించాలని ఆత్రుతగా ఉన్న ప్రాసిక్యూషన్.. శిక్ష విధింపు విషయంలో కీలకాంశాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరలేదని పేర్కొన్నారు. అంటే ప్రాసిక్యూషన్ వారు ముంబై పేలుళ్లలో మెమన్ పాత్రను నిర్ధారించడం లో, శిక్ష విధించడంలో నిర్దిష్టంగా వ్యవహరించలేదని వాపోయారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ, హెచ్‌కే దువా, తుషార్ గాంధీ, నసీరుద్దీన్ షా, మహేశ్‌భట్, శతృఘ్నుసిన్హా, ప్రకాశ్ కారత్, డీ రాజా లాంటి ఎంతో మంది ప్రముఖులు మెమన్ ఉరితీతను రద్దు చేసి క్షమాభిక్ష ప్రసాదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ యాకూబ్ మెమన్‌ను ఉరితీయడం అన్యాయమన్నందుకు దేశ వ్యాప్తంగా అతనిపై విమర్శల దాడి జరిగింది. దీంతో ఆయన తన మాటలు వెనక్కి తీసుకున్నారు. మెమన్ ఉరితీతపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఇలాంటి టెర్రరిస్టు దాడులకు పాల్పడిన హిందువులకు కూడా ఇలాంటి శిక్షనే అమలు చేస్తారా? అని సూటిగానే ప్రశ్నిస్తున్నారు.


ఇరవై ఏళ్లకు పైగా జైల్లోనే ఉంటూ రెండు మాస్టర్ డిగ్రీలు చేసి జీవితంపై చిగురాశలతో జీవించాలనుకుంటున్న వాడికి జీవించే అవకాశం ఇవ్వడం మానవత్వం. ఇదే భారతీయ సాంస్కృతిక జీవనం భిన్నత్వంలో ఏకత్వంతో అందించిన మానవీయత. ఇలాంటి సంక్లిష్ట సమయాల్లోనే మన క్షణికావేశాలకు, రాగద్వేషాలకు అతీతంగా నిలిచి మనదైన విశాల హృదయశీలతను చాటుకోవాలి. తాజా గా సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణ‌యాన్ని తీసుకుంటుందో వేచి చూడాలి...!

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: