బ్యాంకులనుంచి అప్పులు తీసుకోవడం.. వాటికి నాగాపెట్టడం.. వందల కోట్ల రూపాయల మోతాదుల్లో భారీగా లబ్ధి పొందుతూ ఉండడం.. ఇలాంటి లావాదేవీలు కార్పొరేట్‌ కుట్రలు కూహకాల్లో చాలా ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి. అందుకే వ్యాపారవేత్తలు ఎక్కువమంది తమకు రాజకీయ మద్దతు ఉండడంకంటె.. తామే రాజకీయ వేత్తల అవతారం కూడా ఎత్తడం మంచిదని.. అందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. ఇలాంటి తవకఅవకలను చేసేసి.. ఎవ్వరూ అడిగేవరకు రాకపోవచ్చులే.. మనకు రాజకీయ పలుకుబడి ఉన్నది గనుక.. ఈజీగానే తప్పించుకోవచ్చులే అనుకుని ఉపేక్షించినందుకు తెలుగుదేశానికి చెందిన కేంద్రమంత్రి ఇప్పుడు ఉచ్చులో చిక్కుకున్నారు. ఆయన మరెవ్వరో కాదు... చంద్రబాబుకు అత్యంత విశ్వసనీయుడిగా పేరున్న సుజనాచౌదరి. అప్పు ఎగవేత కేసులో సుజనాచౌదరికి సంబంధించిన కంపెనీలను ఇప్పుడు వేలం వేయబోతున్నారు. అటు సొమ్ములూ, ఇటు పరువూ రెండూ పోయే పరిస్థితి కనిపిస్తోంది. 


సుజనాచౌదరికి చెందిన సుజనా యూనివర్సిల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కంపెనీ ఇప్పుడు చిక్కుల్లో పడింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మారిషస్‌లో హెస్టియా హోల్డింగ్స్‌ ఆఫ్‌ మారిషస్‌ కంపెనీ రుణం తీసుకుంది. దీనికి సుజనా యూనివర్సల్‌ ఇండస్ట్రీస్‌ గ్యారంటార్‌గా ఉన్నది. అయితే సదరు కంపెనీ రుణం కట్టకపోవడంతో.. గ్యారంటార్‌ కంపెనీ ఆస్తులను వేలం వేయచ్చునని గతంలోనే తీర్పు వచ్చింది. దీనపై సుజనా కోర్టులోనే అప్పీలు చేసుకున్నారు. రుణం ఇచ్చిన వారు తీసుకున్న వారిని కోర్టుకు లాగగలరు తప్ప.. గ్యారంటార్‌ ఆస్తుల వేలం కుదరదని వాదించారు. అయితే ఆ వాదనలు కోర్టులో నిలబడలేదు. సుజనా కంపెనీని వేలం వేసి రుణం మొత్తం తీసుకునేందుకు న్యాయస్థానం మారిషస్‌ బ్యాంకుకు అనుమతులు ఇచ్చేసింది. 


కాకపోతే.. ఇప్పటికీ సుజనాకు ఒక నెల గడువు ఇచ్చారు. ఈ నెలలోగా.. వంద కోట్ల రూపాయల రుణం తిరిగి చెల్లించినట్లయితే.. వేలం ఇక్కట్లు తప్పుతాయి. ఈ కేసుకు సంబంధించిన వివాదం చాలా కాలంగా న్యాయస్థానాల్లోనే నలుగుతూ వచ్చింది. గతంలోనే ఇది రచ్చకెక్కితే.. తాను అప్పు కట్టేస్తానంటూ సుజనాచౌదరి మారిషస్‌ రుణదాత కంపెనీకి స్వయంగా లేఖరాసినట్లు, కాకపోతే సమయం కోరినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ హామీలు కూడా నిలబెట్టుకోలేకపోవడంతో.. ఇప్పుడు అప్పు వసూలుకు ఏకంగా కంపెనీ ఆస్తుల వేలం వరకు పరిస్థితి వచ్చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: