తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ఓటుకు నోటు వ్యవహారం ఎన్నో సంచలనాలు సృష్టించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయమని చెప్పడానికి టీఆర్ఎస్ నామినెటెడ్ ఎమ్మెల్యే స్టిఫెన్ సన్ కి తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి 50 లక్షలు ఇస్తూ రెండ్ హ్యాండెడ్ గా పట్టుపడిన విషయం తెలిసిందే... తాజాగా ఓటుకు నోటు కేసు చార్జీషీట్ లో ఎపి ముఖ్యమంత్రి,టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ప్రస్తావనకు రావడం ఆయనకు ఇబ్బంది కలిగించే అంశం అవుతుందా అన్నది చర్చనీయాంశంగా ఉంది.

ఈ కేసులో టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ,మరో ముగ్గురిపై చార్జీషీట్ వేసినా, మరో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యపై చార్జిషీట్ ఇంకా వేయలేదు.అదే సమయంలో చార్జిషీట్ లో చంద్రబాబు పేరు ప్రస్తావించారు. ఓటుకు నోటు కేసులో మంగళవారం నాడు తెలంగాణ ఎసిబి న్యాయస్థానంలో ఛార్జీషీటు దాఖలు చేసింది. ఇందులో చంద్రబాబు పేరు ప్రస్తావించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. బాబు, బాస్, నాయుడు అనే పదాలను చంద్రబాబును ఉద్దేశించే వాడినట్లుగా ఎసిబి నిర్ధారణకు వచ్చినట్లు వార్తలొస్తున్నాయి. అంతేకాక తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్సన్ తన వాంగ్మూలంలో చంద్రబాబు పోన్ చేసిన విషయం, బాస్ అంటే ఆయనే అన్న సాక్ష్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న మీదట చార్జిషీట్ లో చంద్రబాబు పేరు ప్రస్తావనకు వచ్చిందని చెబుతున్నారు. 


ఏపీ సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి

 JD Seelam demands for Chandrababu's resignation

ఇక ఈ విషయంపై ఆయన చంద్రబాబు  వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జెడి శీలం బుధవారం నాడు డిమాండ్ చేశారు. ఆడియో టేపుల్లో ఉన్నది తన గొంతు కాదని చంద్రబాబు ఇంతవరకు ఎందుకు చెప్పలేదని అన్నారు. ఆయన మాటల్లోనే తప్పు చేసినట్లుగా అర్థమవుతోందన్నారు. ఆయన తప్పు చేశాడని తాను చెప్పడం లేదని తెలంగాణ రాష్ట్రంలో వెలుగుచూసిన ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఆ రాష్ట్ర పోలీసులు కోర్టులో సమర్పించిన చార్జిషీటులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరుందని అందువల్ల ఆయన తక్షణం సీఎం పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం డిమాండ్ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: