గత నెలలో సవతి తల్లి, కన్న తండ్రి చిత్ర హింసలకు నరకయాతన అనుభవించిన యువతి ప్రత్యూష ఒక సామాజిక కార్యకర్త ద్వారా గ్లోబల్ హాస్పిటల్ లో చికిత్స కోసం చేరింది. ప్రత్యూషకు అవేర్‌ గ్లోబల్‌ ఆస్పత్రి ఉచితంగా వైద్యం అందిస్తోందని చెప్పారు. ఈ సందర్భం గా ఆస్పత్రి యాజమాన్యాన్ని కోర్టు అభినందించింది. పిన తల్లి, తండ్రి రమేష్‌పై సెక్షన్‌ 342, 326ఏ,307 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీ సులు తెలిపారు.


తన తల్లి మరణానంతరం తనను ఏనాడూ మంచిగా చూసుకోలేదు. ఆనా టి నుంచి కొన్నాళ్లు అనాథ ఆశ్రమంలోనే ఉన్నాను. చిత్ర హింసలు పెట్టేది ఆమె. ఆస్తి కోసమే తనకు చిత్రహింసలు. నాన్న ముందే కింద పడేసి కాళ్లతో తన్నేది. అయినా నాన్న పట్టించుకోలేదు. ఇనుప వస్తువులతో వాతలు పెట్టేది. వద్దు ఆ నరకం. నాకు నరకం చూపించి, చిత్ర హింసలు పెట్టినా ఆమెకు కఠిన శిక్ష విధించాలి ఆ యువతి ప్రభుత్వాన్ని కోరింది. అయితే ప్రత్యూషను ఆసుపత్రిలో చాలా మంది ఓదార్చారు. ఇక సినిమా యాక్టర్ పోసాని కృష్ణ మురళి ప్రత్యూష తను వద్దు అనేంత వరకు సహాయం చేస్తానని ముందుకు వచ్చారు. ఇలా ఎంతో మంది ప్రత్యూషకు వెన్ను దన్నుగా నిలిచేందుకు సిద్దం అయ్యారు.


కేసీఆర్ తో బోజనం చేస్తున్న ప్రత్యూష

Prathyusha meets with CM KCR in Camp Office

ఇక తెలంగాణ సీఎం ప్రత్యూష పరిస్థితి చూసి చలించి పోయారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమెను పరామర్షించి తన కన్న కూతురు కంటే ఎక్కువగా చూసి పెళ్లి కూడా చేస్తానని మాట ఇచ్చారు.  తాజాగా   ప్రత్యూష ను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వద్దకు తీసుకు వెళ్లాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా ప్రత్యూషను పరామర్శించి, తాము ఆమె బాద్యతను తీసుకుంటామని ప్రకటించిన నేపధ్యంలో కెసిఆర్ చర్యను హైకోర్టు అబినందించింది. కెసిఆర్ చొరవ వల్ల ఇలాంటి బాధితులు ఎందరికో భరోసా ఇస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రత్యూష ఆస్పత్రిలో ఉన్నప్పుడు కెసిఆర్ పరామర్శించి, తాను స్వయంగా ఆమె కు చదువు చెప్పించి, ఇల్లు కట్టించి,పెళ్లి చేస్తానని, ప్రత్యూష బాద్యతలు చూస్తానని కెసిఆర్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: