ప్రస్తుత రోజుల్లో మారుతున్న జీవిన శైలితో పాటు అలవాట్లు ఆరోగ్యం మీద చాలా చెడు ప్రభాన్ని చూపెడుతున్నాయి. ప్రస్తుత కాలంలో అధికంగా బాధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో అధిక బరువు, ఊబకాయం. చాలా మంది ఈ సమస్యకు వివిధ రకాల ప్రయత్రాలు మరయు డైటింగ్ చిట్కాలు పాటించినా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందుకు మరింత స్మార్ట్ గా పనిచేయాలి.

ఉడికించిన ఆహారం తీసుకోవడానికి బదులు కొద్దిగా చురుకుగా పనిచేయాలి. చురుకుగా పనిచేయాలంటే వర్క్ ఔట్స్ చేయాలని కాదు. మీరు తీసుకొనే చురుకైన పద్దతులే మిమ్మల్ని కొన్ని పౌండ్ల బరువును తగ్గడానికి సహాయపడుతాయి. అయితే మనం బరువు తగ్గడానికి కొన్నిసీక్రెట్ ఫుడ్స్ ఉన్నాయి. ఇప్పటి ఫాస్ట్ ఫుడ్ ల వల్ల, సౌకర్యవంతమైన జీవన శైలి వల్ల యువకులు, చురుకుగా ఉండే వ్యక్తులకు కూడా బానపొట్ట వచ్చేస్తుంది. ఇప్పటి వన్-క్లిక్, వన్-మెస్సేజ్, వన్-కాల్ వాతావరణం వల్ల పొట్ట తగ్గించుకుని నియంత్రించు కోవాలి అంటే కొంత శ్రమ అవసరమే. బానపొట్ట తగ్గించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నప్పటికీ నిపుణులు సూచించిన వ్యాయామాలు చేయడానికి మీకు విశ్వాసంతో కూడిన దృక్పధం, అంకితభావం ఉండాలి.


  పొట్ట తగ్గించుకోవడానికి చిట్కాలు


గ్రీన్ టీ: ఇది బ్లాక్ లేదా గ్రీన్ త్రాగండి, గ్రీన్ టీ బరువు తగ్గించడంలో సమర్ధవంతమైనదని ఏకగ్రీవంగా అంగీకరించబడింది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ద్రవాన్ని నియంత్రణ చేయడానికి మరియు బరువు పెరగకుండానియంత్రించడానికి ఉపయోగపడుతుంది, మరియు తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలు సులభతరం చేస్తుంది. టీ ను రోజుకు రెండు కప్పులు త్రాగేవారిలో 11% మాత్రమే బరువు తగ్గించవచ్చు. 

టమాటాలు : విటమిన్ సి టమాటాలలో అధికం. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. కేలరీలు తక్కువ. సూప్, సలాడ్, పప్పు లేదా పండుగా కూడా తినేయవచ్చు. కేన్సర్, గుండెజబ్బులను నివారిస్తాయి. చర్మం మెరిసేలా చేస్తాయి.

నిమ్మకాయ :  దీనిలో విటమిన్ సి అధికం. మీ జీవప్రక్రియ పెంచుతుంది. స్లిమ్ గా ఉంచుతుంది. ఎసిడిటీ తగ్గించి మొండి రోగాలను దూరం చేస్తుంది.

అరటి పండ్లు :  నీటి శాతం అధికం. పీచు ఉంటుంది. కడుపు నింపుతాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి. మూడ్ మంచిగా ఉండేలా చేస్తాయి.

కేరట్లు :  కార్బో హైడ్రేట్లు అధికంగా ఉండి త్వరగా ఆకలినిస్తాయి. పీచు, విటమిన్ ఎ మరియు బి కాంప్లెక్స్ అధికం. ఇవి సాఫీగా విరోచనం చేస్తాయి.

బీట్ రూట్ :  పీచు అధికం, ఆరోగ్యకర షుగర్ వుండి ఆకలి తీరుస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. అవిసె గింజలు – వీటిని సలాడ్లపై చల్లుకు తినవచ్చు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. కొల్లెస్టరాల్ అదుపులో ఉంచి జీర్ణక్రియ పెంచుతాయి.

ఆకు కూరలు :  కేలరీలు తక్కువ, పీచు ఎక్కువ, గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువ కనుక డయాబెటిక్ రోగులు కూడా తినవచ్చు. కడుపు నింపుతాయి. రక్తాన్ని శుభ్ర పరుస్తాయి.

పచ్చని కూరగాయలు :  బచ్చలికూర, బ్రక్కోలి, తోటకూర, మెంతికూర వంటివి మహిళలకు కావలసిన ఐరన్ అందిస్తాయి. హెమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది. కేలరీలు లేని పీచు బాగా లభిస్తుంది. బరువు తగ్గాలంటే ఇది మంచి చిట్కా.



మరింత సమాచారం తెలుసుకోండి: