ఆంధ్రా- తెలంగాణ పాలకుల మధ్య పరిస్థితులు అంత బాగా లేవన్న సంగతి తెలిసిందే. ఇద్దరు ముఖ్యమంత్రులు పొరుగువారి గురించి ఏం మాట్లాడినా కాంట్రావర్సీ అవుతోంది. అలాంటి సమయంలో కాస్త సంయమనం పాటించడం అవసరం. అయితే ఇటీవల చంద్రబాబు హైదరాబాద్ విషయంలో చేసిన వ్యాఖ్యలు వివాదం సృష్టించాయి. 

హైదరాబాదీయులకు పొద్దున్నే నిద్రలేవడం నేర్పింది ఎన్టీఆరే అని రాజమండ్రి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు కామెంట్ చేశారు. దీనిపై కాస్త ఆలస్యంగానైనా కేసీఆర్ ఘాటుగానే స్పందించారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక మా బతుకు మేం బతుకుతున్నాం.. మాపై ఎందుకు పిచ్చిపిచ్చివ్యాఖ్యలు చేస్తారని గట్టిగానే బదులిచ్చారు. 

నేనన్నది ముమ్మాటికీ నిజం..

Image result for chandrababu naidu
కేసీఆర్ ను అంటే ఏమైనా పడతా.. కానీ తెలంగాణ సమాజాన్ని అంటే ఊరుకోను అని కేసీఆర్ బదులిచ్చారు. అంతే కాదు... ఇటుక తో కొడితే.. రాళ్లతో సమాధానం చెబుతామని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆ రోజు సభలో వేదికపై సి.నారాయణ రెడ్డి వంటి పెద్దలు ఉన్నారు కాబట్టి కేసీఆర్ అక్కడితో ఆగారనే అనుకోవాలి. లేకుండా ఇంకాస్త డోసు పెరిగేదే.

ఇక ఈ వివాదాన్నిఅక్కడితో ఆగిపోతుందనుకుంటున్న సమయంలో ఇదే ఇష్యూపై చంద్రబాబు మరోసారి స్పందించినట్టు తెలుస్తోంది. తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ సందర్భంగా.. తాను హైదరాబాద్ - ఎన్టీఆర్ వ్యాఖ్యను సమర్ధించుకున్నారట. ఎన్.టి.రామారావు వచ్చాకే హైదరాబాద్ లో ఉదయానే నిద్ర లేపేవారని తాను చేసిన వ్యాఖ్యలలో తప్పు ఏముందని ఆయన అన్నారట. కేసీఆర్ ప్రతి అంశాన్ని వివాదం చేస్తున్నారని మండిపడ్డారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: